ఇలాంటి సమావేశాలు ఎందుకు?
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:12 AM
ఐదేళ్లుగా మండల సమావే శంలో సమస్యలపై మాట్లాడుతూనే ఉన్నా. పరిష్కారం కావడం లేదు.. సమావేశానికి అన్ని శాఖల అధికారులు హాజరు కావడం లేదు.. చేసిన పనులకు బిల్లులు చేయరు.. ఇలాంటి సమావేశాలు ఎందుకు? ఉత్సవ విగ్రహాలుగా మిగిలామంటూ ప్రజాప్రతినిధులు సమావేశాన్ని బహిష్క రించారు.
ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాం
మండల సమావేశాన్ని బహిష్కరించిన ప్రజాప్రతినిధులు
మద్దికెర, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లుగా మండల సమావే శంలో సమస్యలపై మాట్లాడుతూనే ఉన్నా. పరిష్కారం కావడం లేదు.. సమావేశానికి అన్ని శాఖల అధికారులు హాజరు కావడం లేదు.. చేసిన పనులకు బిల్లులు చేయరు.. ఇలాంటి సమావేశాలు ఎందుకు? ఉత్సవ విగ్రహాలుగా మిగిలామంటూ ప్రజాప్రతినిధులు సమావేశాన్ని బహిష్క రించారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అనితయాదవ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సభ ప్రారంభం కాగానే మండల ఉపాధ్యక్షుడు మహేశ్వరరెడ్డి, సర్పంచులు బురుజుల విజయుడు, బండారు సహాసిని, ఎంపీటీసీలు రామకృష్ణారెడ్డి, ఆంజనేయులు, జ్యోతి మాట్లాడుతూ ఎంపీడీవో ప్రజాప్రతినిధులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజల దాహార్తి తీర్చే బోర్ల మరమ్మతు పనిముట్లు కూడా ఇవ్వడం లేదని అన్నారు. చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. మండలానికి వచ్చిన నిధులను ఖర్చు చేయనీయకుండా అడ్డు పడుతున్నారని ఆరోపిం చారు. పనులకు సంబంధించిన తీర్మానం ఇవ్వడం లేదని, ఎంపీడీవో నిర్లక్ష్య ధోరణి వల్ల అభివృద్ధి కుంటుపడుతున్నదని ఆరోపించారు. ఎంపీ డీవో కొండయ్య మాట్లాడుతూ దొంగచాటున తీర్మానాలు ఇవ్వడం కుదర దని, మండల సమావేశంలో సభ్యులందరికీ తెలిపి తీర్మానం చేసి కాపీలు ఇస్తామన్నారు. సభ్యులు వెళ్లిపోయినప్పటికీ ఎంపీడీవో కొండయ్య మండ ల శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గూండాల్ నాయక్, జడ్పీటీసీ సభ్యులు మురళీధర్ రెడ్డి, సర్పంచ బొమ్మనపల్లి ఆంజనేయ, సొసైటీ చైర్మన ఆకుల ఆనంద్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.