Share News

ఆ కార్యదర్శిపై చర్యలు తీసుకోరా?

ABN , Publish Date - May 27 , 2026 | 12:14 AM

ఓ వైపు ప్రభుత్వాలు మహిళల సమానత్వం, ఆర్థిక స్వావలంబన అనే ఆదర్శాలను ప్రకటించుకుంటుంటే కొందరు పురుష ఉద్యోగులు కింది స్థాయి మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారు. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె పంచాయతీ కార్యదర్శి సచివాలయ మహిళా ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆ కార్యదర్శిపై చర్యలు తీసుకోరా?
అంకిరెడ్డిపల్లె గ్రామ సచివాలయం

మహిళా ఉద్యోగుల ఆవేదన పట్టించుకోని ఉన్నతాధికారులు

ఆందోళనలో కింది స్థాయి మహిళా ఉద్యోగులు

కొలిమిగుండ్ల, మే 26 (ఆంధ్రజ్యోతి): ఓ వైపు ప్రభుత్వాలు మహిళల సమానత్వం, ఆర్థిక స్వావలంబన అనే ఆదర్శాలను ప్రకటించుకుంటుంటే కొందరు పురుష ఉద్యోగులు కింది స్థాయి మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారు. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె పంచాయతీ కార్యదర్శి సచివాలయ మహిళా ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన తమను తీవ్ర అవమానకరంగా వేధిస్తున్నాడంటూ మహిళా ఉద్యోగులే స్వయంగా ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు స్పందించక పోవడంతో మహిళా ఉద్యోగుల ఆవేదన అరణ్య రోదనగా మారింది. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె గ్రామంలోని స్వర్ణ గ్రామ సచివాలయం-1, 2 మహిళా ఉద్యోగులు గత కొంత కాలంగా పంచాయతీ కార్యదర్శి తమను వేధిస్తున్నాడంటూ కనపడిన వారందరికీ మొర పెట్టుకుంటున్నారు. విధుల పేరుతో వేధిస్తున్నాడని, అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని, ప్రజల ముందే అవమానిస్తున్నాడని మహిళా ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై గత వారం రోజుల క్రితం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంపట్ల తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. దాదాపు 3నెలలుగా వారు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ పంచాయతీ కార్యదర్శి గతంలో ఇలాంటి ఆరోపణలతో సస్సెండ్‌ అయ్యాడు. తిరిగి మళ్లీ పోస్టింగ్‌ దక్కించుకున్న తర్వాత కూడా తీరు మారలేదనే విమర్శలు ఉన్నాయి.

Updated Date - May 27 , 2026 | 12:14 AM