మెనూ పాటించరా?
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:39 AM
: విద్యార్థులను ఇవ్వాల్సిన భోజన మెనూ పాటించకుండా ఇష్టానుసారంగా వంటలు చేయడంపై రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ లక్ష్మీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని పీఎంశ్రీ జిల్లాపరిషత్ బాలికల హైస్కూల్‌ను సందర్శించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మద్యాహ్నా భోజనాన్ని పరిశీలించారు. స్టాకు రికార్డులను పరిశీలించారు
రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి
కోడిగుడ్ల అవకతవకలు, రికార్డుల నిర్వహణపై ఆగ్రహం
వెల్దుర్తిలో పలు పాఠశాలల్లో తనిఖీలు
మ్దెర్తి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): విద్యార్థులను ఇవ్వాల్సిన భోజన మెనూ పాటించకుండా ఇష్టానుసారంగా వంటలు చేయడంపై రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ లక్ష్మీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని పీఎంశ్రీ జిల్లాపరిషత్ బాలికల హైస్కూల్‌ను సందర్శించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మద్యాహ్నా భోజనాన్ని పరిశీలించారు. స్టాకు రికార్డులను పరిశీలించారు. కోడిగుడ్లు సుమారుగా వెయ్యికిపైగా తక్కువ రావడంతో హెచ్‌ఎం చంద్రావతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జడ్పీహెచ్‌ఎ్‌స బాలుర హైస్కూల్‌ను సందర్శించారు. ఉడకబెట్టిన కోడిగుడ్లు 200 పైబడి ఉపయోగించాల్సిన కోడిగుడ్లు వందకు పైగా ఉండడంతో, కోడిగుడ్ల పరిమాణం తక్కువగా ఉండడంతో హెచ్‌ఎం రవినాయక్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో వంటగదిని పరిశీలించి అపరిశుభ్రంగా ఉం డడంతో మీఇల్లు అయితే ఇలాగే పెట్టుకుంటారా? అని అడిగారు. విద్యార్థుల భోజనాన్ని రుచి చూశారు. మెనూలో లేని సాంబారు చేయడంతో మీకు ఎవరు చెప్పారు? కందిపప్పుతో చేయాల్సిన సాంబారును శనగపప్పుతో చేయడాన్ని ఆక్షేపించారు. విద్యార్థుల సంఖ్య ప్రకారం 7కేజీల పైనే ఉపయోగించాలని అలాకాకుండా 3కేజీలతో ఎలా చేస్తారని ప్రశ్నించారు? స్టాకు రికార్డుల నిర్వహణ సరిగా చేయకపోవడంపై జనవరి నెల స్టాకుకు సంబంధించిన వివరాలు లేకపోవడంతో ప్రిన్సిపాల్ షబానా బేగమ్‌పై అసహనం వ్యక్తం చేశారు. కేజీబీవీ పాఠశాలలో తనిఖీ చేసి విద్యార్థులకు మధ్యాహ్నా భోజనాన్ని స్వయంగా వడ్డించారు. ఆహారాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సివిల్ సప్లై అధికారి రఘువీర, జీసీడీవో మేరీ స్నేహలత, సివిల్ సప్లై డీఎం వెంకటరాముడు, ఫుడ్ సేప్టీ అధికారి రాజగోపాల్, లీగల్ మెట్రాలజీ అధికారి రాముడు పాల్గొన్నారు.