తెల్ల బంగారం ధరలు పైపైకి
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:50 PM
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తెల్ల బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం పత్తి ధర క్వింటం గరిష్ఠంగా రూ. 8778 పలికింది.
ఆదోని అగ్రికల్చర్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తెల్ల బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం పత్తి ధర క్వింటం గరిష్ఠంగా రూ. 8778 పలికింది. మూడు రోజుల్లో క్వింటానికి రూ.600కు పైగా ధర పెరిగింది. సంక్రాంతి పండుగ పూట పత్తి ధరలు పెరుగుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి గింజలు దూది ధరలు పెరగడంతో స్థానిక మార్కెట్ యార్డులో ధరలపై ప్రభావం చూపిందని కాటన్ మర్చంట్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. 1158 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా కనిష్ఠ ధర రూ4209, మధ్యస్థం రూ. 7869 పలికింది.