సమ్మర్ క్యాంపులు ఎక్కడ?
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:17 AM
వేసవిలో అన్ని గ్రంథాలయాల్లో విద్యార్థుల కోసం వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించాలి. ఉదయం 8 గంటల నుంచి 11 వరకు విద్యార్థులకు ఆటపాటలు, పుస్తక పఠనం, క్విజ్ పోటీలు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. పెన్నులు, ప్యాడ్స్, సామగ్రి అందించాల్సి ఉంది.
గ్రంథాలయాధికారి నిర్లక్ష్యంపై విమర్శలు
ప్యాపిలి, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): వేసవిలో అన్ని గ్రంథాలయాల్లో విద్యార్థుల కోసం వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించాలి. ఉదయం 8 గంటల నుంచి 11 వరకు విద్యార్థులకు ఆటపాటలు, పుస్తక పఠనం, క్విజ్ పోటీలు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. పెన్నులు, ప్యాడ్స్, సామగ్రి అందించాల్సి ఉంది.
ప్యాపిలిలో కనిపించని శిబిరాలు..
జిల్లాలోని అన్ని గ్రంథాయల్లో వేసవి శిబిరాలు నిర్వహిస్తుంటే ప్యాపిలిలో మాత్రం అవి కనిపించడం లేదు. వేసవిలో పిల్లల కోసం శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం బడ్డెట్‌ను కూడా కేటాయించింది. అయితే ఇక్కడ పనిచేయాల్సిన గ్రంథాలయాధికారి విధులను పట్టించుకోకుండా కర్నూలులో ఉంటున్నట్లు సమాచారం. ఇక్కడ ఓ ప్రైవేటు వ్యక్తిని నియమించి పనిచేయిస్తూ, నెలకు ఒకటి రెండు సార్లు వచ్చివెళ్లుతున్నట్లు సమాచారం. ఈవిషయంపై ఉన్నతాధికారులు స్పందించి గ్రంథాలయాన్ని సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పాఠకులు కోరుతున్నారు. ఈ విషయమై గ్రంథాలయాధికారికి వివరణ కోసం ఫోన్ చేయగా స్పందించలేదు.