అధికారులు ఎక్కడ?
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:26 AM
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి అర్జీలను స్వీకరించాలన్న ప్రభుత్వం ఆదేశం. అయితే సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తహసీల్దార్ పవన్ కుమార్ రెడ్డి, ఎంపీడీవో వర ప్రసాదరావు, ఎంఈవో వెంకటసుబ్బయ్య, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శివమ్మ మాత్రమే హాజరయ్యారు. మిగిలిన అధికారులు డుమ్మా కొట్టారు.
కోవెలకుంట్ల, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి అర్జీలను స్వీకరించాలన్న ప్రభుత్వం ఆదేశం. అయితే సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తహసీల్దార్ పవన్ కుమార్ రెడ్డి, ఎంపీడీవో వర ప్రసాదరావు, ఎంఈవో వెంకటసుబ్బయ్య, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శివమ్మ మాత్రమే హాజరయ్యారు. మిగిలిన అధికారులు డుమ్మా కొట్టారు. ఈ విషయపై తహసీల్దార్‌ను వివరణ కోరగా మిగతావారు హాజరువేసి వెళ్లారని సెలవిచ్చారు. ఈ విషయమై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని, అధికారులంతా ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.