ఎత్తిపోతలకు మోక్షమెప్పుడో?
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:06 AM
గాజులదిన్నె, గంజహళ్లి గ్రామాల రైతుల, ప్రజల కోసం ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసేందుకు నాయకులు, అధికారులు ముందడుగేశారు.
గంజహళ్లి, గాజులదిన్నె ఎత్తిపోతలు ప్రతిపాదనలకే పరిమితం
నేటికీ మంజూరు కాని నిధులు
ఇవి పూర్తయితే తీరనున్న సాగు, తాగునీటి సమస్యలు
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతులు
గోనెగండ్ల, జూలై 5(ఆంధ్రజ్యోతి): గాజులదిన్నె, గంజహళ్లి గ్రామాల రైతుల, ప్రజల కోసం ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసేందుకు నాయకులు, అధికారులు ముందడుగేశారు. గంజహళ్లి ఎత్తిపోతల నిర్మాణానికి రూ.6.30కోట్లు ఖర్చు అవుతున్నట్లు ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదికను పంపారు. గాజులదిన్నె ఎత్తిపోతల పథక ంకు గాను ఇప్పటి వరకు అధికారులు ఐదుసార్లు ఎస్టిమేషన్ వేసి పంపారు. పనులకు గాను రూ.4కోట్లు ఖర్చు అవుతున్నట్లు ఎస్టిమేషన్‌లో పేర్కొన్నారు. ఈ రెండు ఎత్తిపోతలకుగాను గతేడాది సెప్టెంబరు నెలలో జీడీపీ, ఎల్లెల్సీ ఏఈలు కలిసి ప్రతిపాదనలు తయారుచేసి ప్రభు త్వానికి అందజేశారు. అయినా ఇప్పటి వరకూ నిధులు విడుదల కాలేదు. ఈ పథకాలు ఎప్పుడెప్పుడు పూర్తి అవుతాయని రైతులు ఎదురుచూస్తున్నారు.
ఇప్పటి వరకు ఐదు సార్లు..
గోనెగండ్ల సెక్ష న్ కింద ఉన్న తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టు రైతులకు రబీ సీజన్ చివరిలో సాగునీటి సమస్య ఏర్పడుతోంది. పదేళ్ల క్రితం సాగునీటి సంఘాల నాయకులు సమస్యలను నాయకులు దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని ఎల్లెల్సీ కాలువకు మళ్లించి ఎత్తిపోతల ద్వారా ఎల్లెల్సీ ఆయకట్టు భూములను నీరు ఇచ్చేందుకు గాను ప్రతిపాదనలు తయారుచేసి పంపమని ఇరిగేషన్ అధికారులను ఆదేశించింది. 2016లో అధికారులు రూ.2కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. 2017, 2022, 2023, చివరిగా 2025 నవంబరు నెలలో రూ.4కోట్లతో ప్రతిపాదనలు ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి పంపారు. ఇప్పటి వరకు ఐదు సార్లు ప్రతిపాదనలు పంపినా నేటికీ నిధులు మాత్రం విడుదల కాలేదు. ఈపఽథకం కింద 2,755 ఎకరాలకు సాగు నీరు అందించొచ్చు
గంజహళ్లి, బైలుప్పల గ్రామాల్లో..
గంజహళ్లి గ్రామ చెరువు 71 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ చెరువుకు ఎత్తిపోతల పథకం కింద గాజులదిన్నె ప్రాజె క్టులోని నీటిని మళ్లిస్తే అగ్రహారం, గంజ హళ్లి, బైలుప్పల గ్రామాల్లోని దాదాపు 10వేల ఎకరాలకు సాగు నీరు అందిం చొచ్చు. ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్యను కూడా పరిష్కరించవచ్చునని అధికారులు తెలుపుతున్నారు.
ఎల్లెల్సీ నీరు జీడీపీలో నిలువ
గాజులదిన్నె ఎత్తిపోతల పథకంలో భాగంగా గోనెగండ్ల శివార్లలో ఎల్లెల్సీ కాలువ దగ్గర ఎస్కెప్ చానల్‌ను ఇరిగేషన్ అధికారులు ఏర్పాటుచేస్తారు. ఎల్లెల్సీ ఆయకట్టు రైతులకు నీటి అవసరం లేని సమయంలో జీడీపీకి మళ్లించి నిలువ చేస్తున్నారు. ఎల్లెల్సీ ఆయకట్టు రైతులకు అవసర సమయంలో ప్రాజెక్టులో నిలువ చేసుకున్న నీటని వాడుకునే విధంగా ప్రణాళిక తయారు చేశారు.
ఈ రెండు పథకాలు పూర్తయితే..
గంజహళ్లి ఎత్తిపోతల పథకాలు పూర్త యితే గంజహళ్లి, అగ్రహరం, బైలు ప్పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తీరి 10వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. గాజు లదిన్నె ఎత్తిపోతల పథకం పూర్తయితే డీపీ 86 కాలువ, పొనకలదిన్నె కాలువ, మిట్టసోమా పురం (ఎంఎల్ ఎస్‌పీ)కాలువలకు మళ్లించేందుకు వీలు ఉంటుంది. ఎల్లెల్సీ ఆయకట్టు రైతులకు రబీసీజన్‌లో సాగునీటి ఇబ్బంది తీరుతుంది. అలాగే గోనెగండ్ల మం డల శివార్లలో వేముగోడు గ్రామం దగ్గర వన్‌ఎల్, టూఎల్ కాలువ నుంచి గాజుల దిన్నె ప్రాజెక్టు నీటిని కోడు మూరుకు మళ్లించే అవకాశాలున్నాయి. గోనెగ ండ్ల, కోడుమూరు, బెళగల్ మండలాల్లోని ఎల్లెల్సీ ఆయకట్టు రైతులకు రబీలో సాగునీటి ఇబ్బంది తీరనుంది.
పీడీ కాలువ దగ్గర..
గాజులదిన్నె ప్రాజెక్టు సమీపంలో ఉన్న ఎల్లెల్సీ పొనకల దిన్నె(పీడీ) 4/7 దగ్గర కాలువ దగ్గర ఎల్లెల్సీ కాలువ స్థలాన్ని అధికారులు పరిశీలించారు. పీడీ కాలువ వరకు జీడీపీ నుంచి షెట్టర్ కాలువను ఏర్పాటుచేసి జీడీపీ నీరు పీడీ కాలువలోకి చేరేలా డిజైన్‌ను రూపొందిం చారు. అదేప్రాంతంలో పెద్దస్థాయిలో నీటి నిలువ ట్యాంక్‌ను ఏర్పాటు చేస్తారు. ఈనీటిని అందించేందుకు జీడీపీలో ఇన్‌టెక్‌వెల్ నిర్మాణం కోసం అప్పటోకే అధికారులు స్థలాన్ని పరిశీలించారు.
గంజహళ్లి చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే
గంజహళ్లి చెరువుకు ఎత్తిపోతల పఽథ కం ద్వారా గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని పంపింగ్ ద్వారా మళ్లించి అక్కడి నుంచి అగ్రహరం, బైలుప్పల, గంజహళ్లి గ్రామా ల పొలాలకు నీటి ని మళ్లించే అవకాశం ఉంటుంది. రెండు రోజుల క్రితం గంజ హళ్లి చెరువును ఎమ్మెల్యే బీవీ జయనా గేశ్వరరెడ్డి పరిశీలించారు. ఎత్తిపోతలకు సంబంధించి ఎస్టిమేషన్ తయారు చేసి ప్రభుత్వంకు పంపినట్లు ఎమ్మెల్యే తెలిపారు.