Share News

పూర్తయ్యేదెన్నడు?

ABN , Publish Date - Aug 04 , 2026 | 01:05 AM

మండలంలో ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ భవనాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. భవన నిర్మాణాలు పూర్తికగారా, కిచెన్‌లు, ప్రహరీ సమస్యలు వెంటాడుతున్నాయి.

పూర్తయ్యేదెన్నడు?
రుద్ర వరంలో మెయిన్‌ పాఠశాలలో భవనం ఇలా

రుద్రవరం మండలంలో అసంపూర్తిగా పాఠశాల, అంగన్‌వాడీ భవనాలు

రుద్రవరం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): మండలంలో ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ భవనాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. భవన నిర్మాణాలు పూర్తికగారా, కిచెన్‌లు, ప్రహరీ సమస్యలు వెంటాడుతున్నాయి. రుద్రవరం మెయిన్‌, కొత్తపల్లె, మందలూరు, కె. కొత్తూరు, తువ్వపల్లె, డి. కొట్టాలు, చిలకలూరు, మందలూరు, ఎర్రగుడిదిన్నె, అప్పనపల్లె, నక్కలదిన్నె, ఆర్‌.నాగులవరం, మాచినేనిపల్లె, నాగిరెడ్డిపల్లె, తిమ్మనపల్లె, నల్లవాగులపల్లె, ముత్తలూరు, నరసాపురం, ఆలమూరు, చిత్తరేణిపల్లె, బీరవోలు, ముకుందాపురం, చిన్నకంబలూరు, నాగిరెడ్డిపల్లె, యల్లావత్తుల, ముత్తలూరు స్పెషల్‌, రుద్రవరం స్పెషల్‌, హరినగరం పాఠశాలల్లో సమస్యలు వేధిస్తున్నాయి.

ఉన్నత పాఠశాల, కస్తూర్బా భవనాలు..

రుద్రవరం కస్తూర్బా గురుకులం, నరసాపురం ఉన్నత పాఠశాల, పెద్దకంబలూరు ఉన్నత పాఠశాల, ఆలమూరు ఉన్నత పాఠశాల, ఎరగుడిదిన్నె ఉన్నత పాఠశాల, యల్లావత్తుల ఉన్నత పాఠశాలల్లో పనులు కిచెన్‌ షెడ్లు, ప్రహరీ, టాయిలెట్లు పూర్తికాలేదు.

అసంపూర్తిగా అంగన్‌వాడీ కేంద్రం పనులు

పేరూరు-2, కొండమాయపల్లె -1, డి.కొట్టాలు, నరసాపురం, ముత్తలూరు-2, నరసాపురం-1, శ్రీరంగాపురం-1, 2 భవనాల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నా పూర్తికాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశం

పాఠశాలల భవనాలు, ప్రహరీ, వంటగదులు, అంగన్వాడీ కేంద్ర భవనాలను అసంపూర్తిగా ఉన్నాయి. వీటిని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - వెంకటస్వామిరెడ్డి, ఎంఈవో, రుద్రవరం

Updated Date - Aug 04 , 2026 | 01:05 AM