వంతెనలు నిర్మించేదెప్పుడు?
ABN , Publish Date - Mar 23 , 2026 | 12:00 AM
మండలంలోని హరినగరం, ఆలమూరు గ్రామాల సమీపంలో వంతెన తక్కువ ఎత్తులో ఉండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చిలకలూరు, పేరూరు, ఎర్రగుడిదిన్నె గ్రామాల సమీపంలో వకుళానదిపై నేల వంతెనలు ఉన్నాయి.
వర్షం కురిస్తే ్తరాకపోకలు బంద్
రుద్రవరం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని హరినగరం, ఆలమూరు గ్రామాల సమీపంలో వంతెన తక్కువ ఎత్తులో ఉండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చిలకలూరు, పేరూరు, ఎర్రగుడిదిన్నె గ్రామాల సమీపంలో వకుళానదిపై నేల వంతెనలు ఉన్నాయి. పేరూరు వద్ద నిర్మించిన బ్రిడ్జి పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఆలమూరు గ్రామ సమీపాన అట్టడివాగు, దొండ్లవాగు, సినిమా హాలు సమీపంలోనే మరో నేలవంతెన ప్రమాదకరంగా ఉంది. గతంలో వర్షంనీరు దాటుతూ ఆలమూరుకు చెందిన యువకుడు గల్లంతయ్యాడు. హరినగరం, ముకుందాపురం గ్రామాల మధ్య తుండ్లవాగుపై మరో నేల వంతెన ఉంది. ఆర్.నాగలవరం, రుద్రవరం గ్రామాల మధ్య నేలవంతెన ఉంది. నల్లవాగుపల్లె గ్రామాల సమీపంలో మరో నేలవంతెన ఉంది. పందిళ్లపల్లె, పెద్దకంబలూరు గ్రామాల మధ్య మరో నేల వంతెన ఉంది. శ్రీరంగాపురం, కోటకొండ గ్రామాల మధ్య ఇప్పటికీ బ్రిడ్జి నిర్మించక పోవడంతో రాకపోకలకు ఇబ్బందులు. బీరవోలు. ఎకొత్తూరుగామాల మధ్య వంతెన కూలిపోయింది. ఇంత వరకు ఆ వంతెన నిర్మించడానికి మోక్షం లభించలేదు. వెలగలపల్లె సమీపంలో రెండు నేల వంతెనలు ఉన్నాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి నూతన వంతెనలు నిర్మించాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.