Share News

ఇదేమి విచారణ?

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:23 PM

ఇదేమి విచారణ?

ఇదేమి విచారణ?
విచారణ చేస్తున్న ఎంఈవో బ్రహ్మం నాయక్‌

విచారణాధికారిగా ఎంఈవో

ఆ ఉపాధ్యాయుడికి వత్తాసు

తూతూ మంత్రంగా విచారణ

ఎంఈవోను నియమించడంపై విమర్శలు

నిర్లక్ష్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తోంది. విద్యాశాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోగస్‌ హాజరు కొనసాగుతున్నా నామ మాత్రంగా స్పందించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమాలు చోటు చేసుకున్న మండలానికే ఆరోపణలు ఉన్న అధికారిని విచారణకు నియమించడం చర్చనీయాంశమైంది. ఆయన తూతూ మంత్రంగా విచారణ చేపట్టడంపై ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. విచారణాధికారి వచ్చి ఆ ఉపాధ్యాయుడికి వత్తాసు పలకడం చూసి గ్రామస్థులు నివ్వెరపోయారు.

నంద్యాల రూరల్‌, జూలై 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని పులిమద్ది ప్రాథమిక పాఠశాలల్లో జరుగుతున్న బోగస్‌ హాజరుపై అధికారులు నామ మాత్రపు విచారణ చేపట్టారు. విద్యాశాఖలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని వెలుగులోకి వస్తున్నా ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ‘రికార్డులకే పరిమితం.. బోసిపోతున్న ప్రభుత్వ బడులు’ అనే శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు. నంద్యాల ఎంఈవో బ్రహ్మం నాయక్‌ను విచారణాధికారిగా నియమించారు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్పటికప్పుడు మరో ఇద్దరిని..

ఎంఈవో విచారణకు వస్తున్నారన్న సమాచారం ఆ పాఠశాలకు ముందే చేరినట్లు ఉంది. అప్పటికప్పుడు మరో ఇద్దరు విద్యార్థులు ఆ ఉపాధ్యాయుడు తీసుకొచ్చారు. పాఠశాలలో నిహారిక అనే విద్యార్థిని ఒక్కరే ఉన్నప్పటికీ విచారణకు వెళ్లిన సమయంలో అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు విద్యార్థులు హాజరుకావడంపై గ్రామస్థులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విచారణకు అదే మండలానికి చెందిన ఎంఈవోను నియమించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అంతా ముందస్తు సమాచారంతోనే..

పాఠశాలకు ఎంఈవో విచారణకు వస్తున్నారని ముందస్తు సమాచారం చేరింది. ఎంఈవో వచ్చే లోపే వంట చేసే నిర్వాహకులు కూడా అక్కడి చేరుకున్నారు. అన్నం, పప్పు వండటమే కాకుండా మెనూకు మించి అదనంగా కోడిగుడ్డును సైతం వడ్డించారు. విద్యార్థులపై ఎనలేని ప్రేమను చూపారు.

ఆయన సెలవులో ఉండటంతోనే..

రెగ్యులర్‌ ఉపాధ్యాయుడు (కృష్ణారావు) ప్రతిరోజు పిల్లలను ఇంటి నుంచి పాఠశాలకు తీసుకు వచ్చేవాడిని. ఆయన సెలవులో ఉండంతోనే హాజరులో గందరగోళం నెలకొం దని విచారణాధికారి చెప్పడం విడ్డూరంగా ఉంది. ఆ ఉపాఽధ్యాయుడికి మండల విద్యాధికారి వత్తాసు పలుకుతుండం చూస్తే ఆయనపై మక్కువ ఎంటో అర్థమవుతుంది.

సమన్వయ లోపం అని వెల్లడించడం

తాత్కాలికంగా ఆరోజు విధులు నిర్వహి స్తున్న ఉపాధ్యాయుడు, రెగ్యులర్‌ ఉపాధ్యా యుడి మధ్య సమన్వయం లోపం ఉన్నట్లు విచారణాధికారి వెల్లడించడం విడ్డూరంగా ఉంది. అటువంటి అధికారినే విచారణ చేప ట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించడంపై గ్రామస్థులు పలు అనుమా నాలు వ్యక్తం చేస్తున్నారు.

11 మంది బోగస్‌ అని తేల్చాం

పులిమద్ది ప్రాథమిక పాఠశాలలో బోగస్‌ హాజరుపై విచారణ చేపట్టాం. అందులో 11 మంది బోగస్‌ అని తేలింది. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. ఆ విద్యార్థులు ఏఏ పాఠశాలలో చదువుతున్నారో విచారించి ఉన్నతాధికారుకుల నివేదిక సమర్పిస్తాం.

బ్రహ్మంనాయక్‌, మండల విద్యాధికారి, నంద్యాల

నిజాలు తేలితే సస్పెండ్‌ చేస్తాం

మండలంలోని పులిమద్ది గ్రామంలో ప్రాథమిక పాఠశా లలో హాజరుకు సంబంధించిన విషయంలో అవకతవకలు జరిగినట్లు విచారణ చేపట్టాం. అందులో నిజాలు తేలితే అందుకు సంబం ధించి రెగ్యులర్‌, డిప్యుటేషన్‌ ఉపాధ్యాయు లను సస్పెండ్‌ చేస్తాం. ప్రస్తుతం ప్రాథమిక విచారణ చేపట్టాం. అవసరమైతే ప్రత్యేక అధికారిని నియమించి విచారణ చేస్తాం.

జనార్దన్‌రెడ్డి, డీఈవో, నంద్యాల

Updated Date - Jul 03 , 2026 | 11:23 PM