సారూ.. ఇదేం తీరు?
ABN , Publish Date - Sep 29 , 2026 | 12:19 AM
మండలకేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎ్‌సకు అధికారులు డుమ్మా కొడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ. తహసీల్దార్ కారర్యాలయంలో నెల నుంచి వీడియో కాన్ఫరెన్స్ పరికరాలు పనచేయకపోవడంతో ప్రతి సోమవారం పీజీఆర్‌ఎ్‌సను మొక్కుబడిగా నిర్వహిస్తున్నట్లు విమర్శలు వస్తున్నారు.
కొలిమిగుండ్ల పీజీఆర్‌ఎస్‌లో కనిపించని అధికారులు
కొలిమిగుండ్ల, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎ్‌సకు అధికారులు డుమ్మా కొడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ. తహసీల్దార్ కారర్యాలయంలో నెల నుంచి వీడియో కాన్ఫరెన్స్ పరికరాలు పనచేయకపోవడంతో ప్రతి సోమవారం పీజీఆర్‌ఎ్‌సను మొక్కుబడిగా నిర్వహిస్తున్నట్లు విమర్శలు వస్తున్నారు. సోమవారం 12 గంటలకు కూడా కార్యాలయంలో తహసీల్దార్ తప్ప ఏఒక్క అధికారి కనిపించకపోవడంతో అర్జీదారులు నిరాశతో వెనుదిరిగారు. తాను ఉదయం 11 గంటలకు కార్యాలయానికి వస్తే ఎవరూ లేరని సీపీఐ మండల కార్యదర్శి సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు తహసీల్దార్ రావడంతో ఆయనకు వినతిపత్రం ఇచ్చామన్నారు.
సమయ పాలన ఏదీ?
చాగలమర్రి: తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్‌సెల్‌కు అధికారులు సమయ పాలన పాటించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉదయం 10 గంటలకే రావలసిన అధికారులు పత్తాలేని వాపోతున్నారు. మధ్యాహ్నానికి కాని వచ్చి వెంటనే వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా తహసీల్దార్ ఫణింద్రుడు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.