ఆర్‌యూలో ఏం జరుగుతోంది..?
ABN , Publish Date - Mar 17 , 2026 | 11:57 PM
రాయలసీమ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. గత వారం వర్శిటీ పరిపాలన భవనాన్ని ఏఐఎ్‌సఎఫ్, ఏఐఎ్‌సఏ, పీడీఎ్‌సయూ, ఆర్‌పీఎఫ్ విద్యార్థి సంఘాలు ముట్టడించి నిరసన తెలిపాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ ఉద్యమాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేషీ అధికారులు ఆరా తీశారు.
మంత్రి లోకేష్ పేషీ నుంచి విద్యార్థిఽ నేతలకు ఫోన్లు
వివరణపై తర్జన భ ర్జనలో అధికారులు
అనుకూలంగా ఎస్‌ఎఫ్‌ఐ రౌండ్ టేబుల్ సమావేశం
కర్నూలు అర్బన్, మార్చి 17(ఆంధ్రజ్యోతి): రాయలసీమ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. గత వారం వర్శిటీ పరిపాలన భవనాన్ని ఏఐఎ్‌సఎఫ్, ఏఐఎ్‌సఏ, పీడీఎ్‌సయూ, ఆర్‌పీఎఫ్ విద్యార్థి సంఘాలు ముట్టడించి నిరసన తెలిపాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ ఉద్యమాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేషీ అధికారులు ఆరా తీశారు. శ్యాప్ ఎండీ అనిమిని రవి నాయుడు విద్యార్థి సంఘాల నాయకులకు నేరుగా ఫోన్ చేసి వివరాలు సేకరించినట్లు ఓ విద్యార్థి నాయకుడు తెలిపారు. ఈ ఆందోళనలపై వివరణ కోరుతూ వర్శిటీ అఽధికారులను మంత్రి పేషీ సంజాయిషీ కోరినట్లు సమాచారం. స్పందించిన వర్శిటీ అధికార్లు ఓ ప్రొఫెసర్ కను సన్నల్లోనే విద్యార్థులంతా ఆందోళనలు చేస్తున్నారని మౌఖికంగా వివరణ ఇవ్వడం.. ఆ తర్వాత వర్శిటీ ఉన్నతాధికారులు వర్శిటీలోని ఉద్యోగులు, ఆధ్యాపకులు, ప్రొఫెసర్లతో సమావేశం ఏర్పాటు చేసి నిబంధనలు అతిక్రమించకుండా వర్శిటీ పరిధిలో పని చేస్తామంటూ సెల్ప్ డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న విద్యార్థి నాయకులపై వేటు వేయాలని ఓ అధికారి ఆయా హెచ్ వోడీలకు సూచించారని ఓ ప్రొఫెసర్ తమను హెచ్చరించారని విద్యార్థులు అంటున్నారు. ఈ క్రమంలోనే వర్శిటీ అఽధికారులకు అనుకూలంగా ఎస్‌ఎ్‌ఫఐ మంగళవారం వర్శిటీలో రౌండ్ టేబుల్ సమావేశం చేపట్టిన విషయం తెలిసి వర్శిటీ ప్రధాన ద్వారం ఎదుట ఏఐఎ్‌సఎఫ్, ఏఐఎ్‌సఏ. పీడీఎ్‌సయూ, ఆర్‌పిఎ్‌సఎఫ్ ఆధ్వర్యంలో ఓ అధికారి దిష్టి బొమ్మదహనం చేశారు. ఈ పరిణామాల నేపఽథ్యంలో కొందరు ప్రొఫెసర్లు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
పోరాటాల ద్వారానే వర్శిటీ అభివృద్ధి- ఎస్‌ఎ్‌ఫఐ
పోరాటాల ద్వారానే రాయలసీమ యూనివర్సిటీని అభివృద్ధి చేసుకుందామని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. మంగళవారం రాయలసీమ యూనివర్సిటీలోని డేటా సెంటర్ ప్రాంగణంలో ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో వర్శిటీ అభివృద్ధిపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్‌ఎ్‌ఫఐ ఆఽధ్వర్యంలో జరిగే పోరాటాలకు విద్యార్థి, యువజన సంఘాలు మద్దతు తెలిపాలని కోరారు. వర్శిటీలో జరిగిన అవినీతిపై విచారణ జరపాల్సిందేనని కోరారు. వర్శిటీలో ఖాళీగా ఉన్న ఫ్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని, రూ. 200 కోట్లు కేటాయించాలని, నూతన భవనాలు, నూతన కోర్సులు, పరిశోధనల కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. ఈ సమావేశానికి వర్శిటీ ఎస్‌ఎ్‌ఫఐ సహాయ కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు భగత్ రవీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు క్రాంతి నాయుడు, ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ అసోసియేషన్ నాయకుడు నగేష్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఆర్‌యూ ఎదుట అధికారి దిష్టి బొమ్మ దహనం..
అవినీతి, అక్రమాలపై విచార ణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏఐఎ్‌సఎఫ్, ఏఐఎ్‌సఏ. పీడీఎ్‌సయూ, ఆర్‌పీఎ్‌సఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం రాయలసీమ యూనివర్సిటీ ఎదుట ఓ అధికారి దిష్టి బొమ్మను దహనం చే సి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎ్‌సఏ రాష్ట్ర కార్యదర్శి ఎస్, నాగార్జున, పీడీఎ్‌సయూ రాష్ట్ర నాయకులు రమణ, ఆపీఎ్‌సఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ ఓ అధికారి నిధులను అడ్డగోలుగా దోచుకుంటున్నాడని ఆరోపించారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వర్శిటీ భూముల అక్రమణలు రోజు రోజుకూ పెరుగున్నప్పటికి అఽధికారులు స్పందించకపోవడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అవినీతి అక్రమాలపై త్వరలో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను కలిసి వివరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వంశీ, దినేష్; రాము, తేజ, బాలాజీ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.