ఎన్నికల హామీలేమయ్యాయి?
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:36 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు ప్రశ్నించారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు
అవుకు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు ప్రశ్నించారు. సీపీఐ చేపట్టిన జీపు జాతా రెండో రోజు అవుకుకు చేరుకుంది. పట్టణంలోని బస్టాండు సర్కిల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రంగనాయుడు మాట్లాడుతూ రైతులు, కార్మికుల సమ స్యలను తెలుసుకొని పరిష్కాం కోసం ఈనెల 17న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. కూటమిలోని పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ లను నెరవేర్చే వరకు పోరాటం సాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్ర మంలో సీపీఐ నాయకులు భార్గవ్, సంజీవులు, సుబ్బారెడ్డి, ఏఐటీయూసీ, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు బాలకృష్ణ, ఎర్రిస్వామి పాల్గొన్నారు.
రైతుల బాధ పట్టదా...
కొలిమిగుండ్ల, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : రామ్‌కో పరిశ్రమ వల్ల తీవ్రంగా నష్టపోతున్న రైతుల బాధ ప్రతిపక్ష వైసీపీకి పట్టదా అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు ప్రశ్నించారు. శుక్రవారం సీపీఐ జీపు జాతా కార్యక్రమంలో భాగంగా కొలిమిగుండ్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్టీసి బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ బనగానపల్లె నియోజకవర్గంలో సిమెంట్ పరిశ్రమలు రైతులను నిలువునా ముంచుతున్నా అధికార, ప్రతిపక్ష పార్టీలు పట్టించుకోకపోవడం తీవ్ర అన్యాయమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సుబ్బారెడ్డి, పుల్లయ్య, సంజీవులు తదితరులు పాల్గొన్నారు.