ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను చేరవేయాలి
ABN , Publish Date - May 09 , 2026 | 11:50 PM
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి పార్టీ శ్రేణులకు ఆదేశించారు.
టీడీపీ శ్రేణులకు గౌరు దంపతుల ఆదేశం
కల్లూరు, మే 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి పార్టీ శ్రేణులకు ఆదేశించారు. శనివారం మాధవీ నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాణ్యం నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా గౌరు దంపతులు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ నాయకులు సంసిద్ధంగా ఉండాలన్నారు. కల్లూరు అర్బన వార్డులతోపాటు అన్ని గ్రామాల్లో కూటమి ప్రభు త్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేర వేయాలన్నారు. ఇప్పటికే గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.