సంక్షేమ పథకాలు అమలు చేయాలి
ABN , Publish Date - Oct 13 , 2026 | 12:08 AM
భవన నిర్మాణ కార్మికులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ అంజిబాబు డిమాండ్ చేశారు.
కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణ కార్మికులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ అంజిబాబు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట భవన నిర్మాణ కార్మిక సంఘం, సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంజిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసింద న్నారు. కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.నరసింహులు, ఖాజాపాష, జిల్లా కన్వీనర్ సుధాకరప్ప, పాల్గొన్నారు.