పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Mar 01 , 2026 | 12:33 AM
): నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని బీసీ కాలనీలో పింఛన్లను మంత్రి పంపిణీ చేశారు. లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
పింఛన్ల పంపిణీ
బనగానపల్లె, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని బీసీ కాలనీలో పింఛన్లను మంత్రి పంపిణీ చేశారు. లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 20 నెలల్లోనే లబ్దిదారులకు రూ.60వేల కోట్లకు పైగా సంక్షేమ పలాలలు సీఎం చంద్రబాబు అందించారన్నారు. సంక్షేమం, అభివృద్ది రెండుకళ్లలా బావించి రాష్ట్రాన్నిఅభివృద్ది దిశగా పయనింప చేస్తున్నామన్నారు. షబ్బీర్, బురానుద్దీన్, వెంకటరామిరెడ్డి, బొబ్బల మహేశ్వరరెడ్డి, దివాకర్‌రెడ్డి, టంగుటూరు శ్రీనయ్య, కాశీంభాష, కూరగాయలశేఖర్, సలాం, గౌండా బాషా, ఎంపీడీవో నాగరాజు, డీఈ నాగశ్రీనివాసులు, హౌసింగ్ డీఈ కృష్ణారెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో బాలాంజనేయులు, సచివాలయ ఎంపీడీవో తిరుమలేశ్వరరెడ్డి, ఈవో సతీశ్‌రెడ్డి, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పనులు వేగవంతం చేయాలి..
పట్టణంలో చేసున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. శనివారం బనగానపల్లె పట్టణంలోని పాత తహసీల్దారు కార్యాలయం పునరుద్దరణ పనులను పరిశీలించారు. పురాతన భవనాలు వారసత్వ సంపద అని, వాటిని సంరక్షించడం మనందరి మన బాధ్యత అన్నారు. ఈఈ శ్రీధర్‌రెడ్డి, డీఈ రెడ్డి గోవింద్, ఏఈ హుసేన్, పంచాయితీరాజ్ డీఈ నాగశ్రీనివాసులు, విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని బీసీ కాలనీలో అభివృద్ది పనులను పరిశీలించారు.