సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - May 04 , 2026 | 12:13 AM
ప్రజాసంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. ఆదివారం నందవరం, గోనెగండ్ల మండలాల్లోని మిట్టసోంపురం, గంజళ్ల గ్రామాలకు చెందిన వైసీపీ వర్గీయులు 500 మంది ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు
ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి
ఎమ్మిగనూరు/నందవరం, మే3 (ఆంధ్రజ్యోతి): ప్రజాసంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. ఆదివారం నందవరం, గోనెగండ్ల మండలాల్లోని మిట్టసోంపురం, గంజళ్ల గ్రామాలకు చెందిన వైసీపీ వర్గీయులు 500 మంది ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఆదివారం ఆర్‌అండ్‌బీ గెస్టెహౌ్‌సలో ఏర్పాటుచేసిన సమావేశంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే సంక్షేమం, అభివృద్ది రెండు కళ్లుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. ఇందుకు ఆకర్షితులై అనేక మంది టీడీపీలో చేరుతున్నారన్నారు. ఏపీ మాల వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పోతురాజు రవికుమార్, ఏఎంసీ చైర్మన్ మల్లయ్య, మండల నాయకులు కాశీం వలి, ధర్మపురం గోపాల్, తిరుపతయ్య నాయుడు, కృష్ణమనాయుడు, నజీర్, మిట్టసోమాపురం గ్రామస్థులు డీలర్ బొజ్జన్న, గోకారమ్మ, ముక్యప్ప, పెద్ద లింగన్న, తాంబెలు లింగన్న, పెద్దరెడ్డి, లింగన్న, ఆంజనేయులు కొండన్న లింగమూర్తి పాల్గొన్నారు.