ఇంటింటికీ సంక్షేమం, అభివృద్ధి
ABN , Publish Date - Jul 28 , 2026 | 12:35 AM
రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి కుటుం బానికి సంక్షేమం, అభివృద్ధి అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కూటమి రెండేళ్ల పాలనపై డోర్ టు డోర్ ప్రచారం
కల్లూరు, జూలై 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి కుటుం బానికి సంక్షేమం, అభివృద్ధి అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం కల్లూరు అర్బన 41వ వార్డు ఎన్టీఆర్.నగర్, నేతాజీనగర్‌లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. గౌరుచరితారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారన్నారు. కార్యక్రమంలో ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన చైర్‌పర్సన కె.పార్వతమ్మ, పాణ్యం టీడీపీ పరిశీలకుడు చల్లా లక్ష్మీప్రసాద్, వార్డ్ ఇనచార్జి జనార్ధన ఆచారి, జవ్వాజి గంగాధర్‌గౌడ్, కాసాని.మహేష్‌గౌడ్, నాగేశ్వరరావు, రాఘవేంద్ర ఆచారి, ఖాదర్, ఇమ్మానియోలు, గాంధీ, జంగాల వెంక టేశ్వర్లు పాల్గొన్నారు.