Share News

రోడ్లపై సంత..

ABN , Publish Date - Apr 26 , 2026 | 11:49 PM

పట్టణంలో వ్యాపారులు ప్రతి ఆదివారం రోడ్లపైనే వారపు సంత నిర్వహిస్తున్నారు. దీంతో కోటపేట నుంచి పాతబస్టాండ్‌కు రావాలంటే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రోడ్లపై సంత..
పట్టణంలో రోడ్లపై వారపు సంత నిర్వహిస్తున్న వ్యాపారులు

బేతంచెర్లలో ఇబ్బంది పడుతున్న వాహనదారులు, పాదచారులు

వాహనదారుల చింత

బేతంచెర్ల, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో వ్యాపారులు ప్రతి ఆదివారం రోడ్లపైనే వారపు సంత నిర్వహిస్తున్నారు. దీంతో కోటపేట నుంచి పాతబస్టాండ్‌కు రావాలంటే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం వచ్చిందంటే గ్రామాల నుంచి పజలు, వ్యాపారులతో ఈ ప్రాంతం కిటకిటలాడుతోంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. వ్యాపారులు మార్కెట్‌లోనే వారపు సంత నిర్వహించుకు నేలా నగర పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - Apr 26 , 2026 | 11:49 PM