వర్షం కోసం గాడిదలకు వివాహం
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:24 AM
కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలోని గూళ్యం గ్రామంలో వరుణుడి కరుణ కోసం వాసుదేవళ్లుగా పిలువబడే గాడిదలకు వివాహం జరిపించారు.
హాలహర్వి, జూలై 30 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలోని గూళ్యం గ్రామంలో వరుణుడి కరుణ కోసం వాసుదేవళ్లుగా పిలువబడే గాడిదలకు వివాహం జరిపించారు. ఆరుకాలం శ్రమించే రైతన్నలు అనేక యాగాలు, పూజలు, వాసుదేవళ్లకు పెళ్లిళ్లు, కప్పల ఊరేగింపులు, బిందుసేవలు వంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. గూళ్యంలో గురువారం గాడిదలకు పెళి చేసి గంగపూజతో ఊరేగింపు చేయడం ఆ గ్రామంలో కనువిందుగా మారింది. గ్రామస్థులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.