Share News

సైనికుల సంక్షేమానికి కృషి చేస్తాం

ABN , Publish Date - Jan 13 , 2026 | 11:48 PM

సైనికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని సైనిక సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల డిప్యూటీ డైరెక్టర్‌ రత్నరూత్‌ అన్నారు.

సైనికుల సంక్షేమానికి కృషి చేస్తాం
డిపెండ్‌ కార్డ్స్‌ పంపిణీ చేస్తున్న రత్నరూత్‌

సైనిక సంక్షేమశాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ రత్నరూత్‌

ఆలూరు, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సైనికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని సైనిక సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల డిప్యూటీ డైరెక్టర్‌ రత్నరూత్‌ అన్నారు. మంగళవారం ఆలూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సైనికుల కుటుంబ సభ్యులతో, మాజీ సైనికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం సైనికుల కుమార్తెలకు ఇస్తున్న వివాహ ప్రోత్సాహాన్ని రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచారన్నారు. సైనికుల కుటుంబాలకు ఇంటి పన్ను కూడా మినహాయింపు ఇస్తుందన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 5వేల మందికి పైగా సైనికులు ఉన్నారన్నారు. వీరందరి కుటుంబ సభ్యులకు డిపెండ్‌ కార్డ్స్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ సైనికుల సంఘం ఆలూరు తాలూకా అధ్యక్షుడు శివప్రసాద్‌, కార్యదర్శి గోపాల్‌, గౌరవాధ్యక్షులు ఎస్‌.బి. శ్రీనివాసులు, మహేష్‌, రంగస్వామి పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 11:48 PM