ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తాం
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:43 PM
: ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్
కర్నూలు కల్చరల్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. శనివారం పాత నగరంలోని రాంభొట్ల దేవాలయం నుంచి పూల బజార్‌లోని చిన్న అమ్మవారిశాల వరకు తలపెట్టిన కలశ యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు తాము ముందు ఉంటామని తెలిపారు. లలితా పీఠం పీఠాధిపతి గురు మేడా సుబ్రహ్మణ్యంస్వామి, సాయిబాబా, నాగ వీరాంజనేయులు పాల్గొన్నారు.