జిల్లాను గ్రీన్ ఎనర్జీగా తీర్చిదిద్దుతాం
ABN , Publish Date - Jan 21 , 2026 | 10:36 PM
‘ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ ద్వారా జిల్లాను గ్రీన్ ఎనర్జీగా తీర్చి దిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాజకుమారి రాష్ట్ర ప్రభు త్వ ప్రధానకార్యదర్శి కె.విజయనంద్‌కు సూచించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ‘ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ ద్వారా జిల్లాను గ్రీన్ ఎనర్జీగా తీర్చి దిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాజకుమారి రాష్ట్ర ప్రభు త్వ ప్రధానకార్యదర్శి కె.విజయనంద్‌కు సూచించారు. బుధవారం ఆయన అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో పీఎం కుసుం, పీఎం సూర్యఘర్ పథకాలపై వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్‌హాలు నుంచి కలెక్టర్‌తో పాటు ట్రాన్స్‌కో అధికా రులు పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ పీఎం సూర్యఘర్‌కి సంబంధించి 22,590 మంది ఎస్సీ, ఎస్టీల గృహాలపై సోలార్ వెలుగులు నింపేందుకు ముందుకెళ్తున్నామన్నారు. జిల్లాలో 116 ఎకరాలలో పీఎం కుసుం ప్రాజెక్టు నిర్మిస్తామని, ఇందుకు 12ఎకరాలు ప్రభుత్వ, 104ఎకరాలు ప్రైవేటు భూమిలో నెలకొల్పేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి
సింగిల్ డెస్క్ విధానంలో అర్జీదారులు సమర్పించిన పరిశ్రమల అను మతి దరఖా స్తులను నిర్ణీత గడువులోపే పరిష్కరించి, నూతన పారిశ్రా మికవేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశిం చారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాలులో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ(డీఐఈపీసీ) సమావేశాన్ని ని ర్వహిం చారు. ఆమె మాట్లాడుతూ వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతుల కోసం మొత్తం 1,470 దరఖాస్తులు అందగా, సింగిల్ డెస్క్ విధానం ద్వారా 1465 పరి శ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు.