Share News

స్వచ్ఛ కర్నూలుగా తీర్చిదిద్దుతాం

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:01 AM

నగరాన్ని స్వచ్ఛ కర్నూలుగా తీర్చిదిద్దుతామని నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబు లేసు అన్నారు.

స్వచ్ఛ కర్నూలుగా తీర్చిదిద్దుతాం
పారిశుధ్య పనులను పరిశీలిస్తున్న కమిషనర్‌ చల్లా ఓబులేసు

నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): నగరాన్ని స్వచ్ఛ కర్నూలుగా తీర్చిదిద్దుతామని నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబు లేసు అన్నారు. గురువారం విద్యానగర్‌, గాంధీనగర్‌, రోజా వీధి, వెంకట రమణ కాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పను లను ఆయన పరిశీ లించారు. ఆయన మాట్లాడుతూ నగరంలో చెత్త పేరుకుపోయిన ప్రాంతా లను గుర్తించి వాటిని సుందరంగా తీర్చిదిద్దే చర్యలు చేపడుతున్నామ న్నారు. నగర పరిధిలో 135 జీవీపీలను గుర్తించగా, ఇప్పటికే 36 జీవీపీ లను శుభ్రపరిచి గ్రీనరీ, మొక్కలు, బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన జీవీపీల్లో దశలవారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారిపై నిఘా ఉంచి జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరిం చాలని, ఎక్కడపడితే అక్కడ చెత్త వేకుండా బాధ్యతగా వ్యవహరిం చాలని కమిషనర్‌ కోరారు. ఆయన వెంట ప్రజారోగ్య అధికారి డా. ఎం.రఘు, శానిటరీ సూపర్‌వైజర్‌ రమేష్‌బాబు, ఇనస్పెక్టర్లు మునిస్వామి, అనిల్‌, మల్లికార్జున ఉన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 12:01 AM