Share News

ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతాం

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:18 PM

బనగానపల్లెను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతాం
బైపాస్‌ రోడ్డు పనులను పరిశీలిస్తున్న మంత్రి బీసీ

బనగానపల్లెలోని దీర్ఘకాలిక సమస్యలన్నిటికీ పరిష్కారం - మంత్రి బీసీ

బనగానపల్లె, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): బనగానపల్లెను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మాణ దశలో ఉన్న నూతన ఆర్డీవో కార్యాలయ భవనాన్ని మంత్రి పరిశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. పనులను వేగవంతం పూర్తిచేయాలని పంచాయతీ రాజ్‌ డీఈ నాగశ్రీనివాసులును ఆదేశించారు. ఆంజనేయస్వామి వీఽధిలో జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అఽధికారులకు సూచించారు. వర్షాల సమయంలో నీరు నిలిచిపోకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని ఆదేశించారు. యాగంటిపల్లె రోడ్డులో నిర్మాణంలో ఉన్న బైపాస్‌ రోడ్డును ఆర్‌ఆండ్‌బీ అధికారులతో కలసి మంత్రి పరిశీలించారు. పట్టణంలో పెరుగుతున్న రాకపోకలు, ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణాసౌకర్యం కల్పించేందుకు బైపా్‌సరోడ్డు కీలకంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు శాశ్వతపరిష్కారం చూపే లక్ష్యంతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. బనగానపల్లెను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పనులు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఆండ్‌బీ ఈఈ శ్రీధర్‌రెడ్డి, ఏఈ హుసేన్‌, ఈవో మురళీమోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 11:18 PM