Share News

జర్మన భాషను నేర్పిస్తాం

ABN , Publish Date - Jul 22 , 2026 | 12:05 AM

ఇంటర్‌ విద్యా ర్థులకు ఈఏడాది నుంచి కొత్తగా జర్మన భాషను నేర్పిస్తామని కర్నూ లు ఆర్‌సీఎం డయోసిస్‌ బిషప్‌ గోరంట్ల జ్వాన్నేష్‌ అన్నారు.

జర్మన భాషను నేర్పిస్తాం
ప్రసంగిస్తున్న బిషప్‌ గోరంట్ల జ్వాన్నేష్‌

బిషప్‌ గోరంట్ల జ్వాన్నేష్‌

సెయింట్‌ మేరీస్‌ జూనియర్‌ కళాశాల నూతన భవనాలు ప్రారంభం

కర్నూలు కల్చరల్‌, జూలై 21(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ విద్యా ర్థులకు ఈఏడాది నుంచి కొత్తగా జర్మన భాషను నేర్పిస్తామని కర్నూ లు ఆర్‌సీఎం డయోసిస్‌ బిషప్‌ గోరంట్ల జ్వాన్నేష్‌ అన్నారు. మంగ ళవారం నగర శివారులోని ఆర్‌సీ ఎం డయోసిస్‌ పరిధిలోని సెయిం ట్‌ మేరీస్‌ జూనియర్‌ కళాశాలలో నూతనంగా సైన్స, కంప్యూటర్‌ ల్యాబ్‌లను అధునాతన హంగులతో నిర్మించగా ఆయన వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిషప్‌ మాట్లాడుతూ తమ కళాశాలలో కర్నూలు డయోసిస్‌ కింద ఉన్న కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల నుంచి ఇంటర్‌లో పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించి, వారిని ఉన్న తులుగా తీర్చిదిద్దుతామన్నారు. పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యతో పాటూ జర్మనీ దేశంలో ఉపాధి అవకాశాలు కల్పించేలా జర్మనభాషను నేర్పిస్తున్నామన్నారు. సెయింట్‌ మేరీస్‌ కళాశాల ఎంద రో మేధావులను అందించిన గొప్ప కళాశాల అని, ఎందరో అధ్యాప కులు విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేశారన్నారు. ఈ కళాశాల ప్రారంభించి 46 ఏళ్లు పూర్తయిందని ఆయన గుర్తు చేశారు. సమావేశంలో కళాశాల కరస్పాండెంట్‌ విజయభాస్కర్‌, ప్రిన్సిపాల్‌ ఆంథోని రాజు, వైస్‌ ప్రిన్సిపాల్‌ జి. బాబాయ్‌లతోపాటూ వివిధ విభా గాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ పనిచేసి పదవీ విరమణ పొందిన అధ్యాపకులను బిషప్‌ శాలువలు కప్పి ఘనంగా సత్కరించారు. కళాశాల అభివృద్ధికి సహకరించాలని, తగిన సూచన లు అందజేయాలని బిషప్‌ పూర్వ అధ్యాపకులను కోరారు.

Updated Date - Jul 22 , 2026 | 12:05 AM