Share News

ఇంధన కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:05 PM

జిల్లాలో ఎక్కడా ఇంధన కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ రాజకుమారి వెల్లడించారు.

ఇంధన కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి, పక్కన ఎస్పీ సునీల్‌ షెరాన్‌

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎక్కడా ఇంధన కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ రాజకుమారి వెల్లడించారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్‌లో ఎస్పీ సునీల్‌ షెరాన్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇంధన కొరత సమస్య తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధతో తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులతో పాటు పెట్రోల్‌ బంకు యాజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు, ముఖ్యంగా వ్యవసాయ కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇంధన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా జరగడం లేదని అధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఎస్పీ సునీల్‌ షెరాన్‌ మాట్లాడుతూ.. పెట్రోల్‌ బంకుల వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో డీఎ్‌సఓ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 11:05 PM