బొగ్గు లైన్ బాధితులకు ఆదుకుంటాం
ABN , Publish Date - May 21 , 2026 | 10:47 PM
రోడ్ల విస్తరణలో నివా సాలు కోల్పోయిన బొగ్గులైన్ బాధితులను ఆదుకుంటామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ హామీ ఇచ్చారు.
మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల రూరల్, మే 21 (ఆంధ్రజ్యోతి) : రోడ్ల విస్తరణలో నివా సాలు కోల్పోయిన బొగ్గులైన్ బాధితులను ఆదుకుంటామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ హామీ ఇచ్చారు. గురువా రం బాధితులకు కేటాయించడానికి అనువైన స్థలాలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుకూలమైన స్థలం కేటాయించి అన్ని వసతులు సమకూర్చాలని ఆధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. త్వరితగతిన స్థల సేకరణ చేపట్టి, పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. ఆయన వెంట నంద్యాల ఆర్డీవో చల్లా విశ్వనాధ్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, నంద్యాల అర్బన్ డిప్యూటీ తహసీల్దార్ సంజీవ తదితరులు ఉన్నారు.