ఆర్యవైశ్యుల అభివృద్ధికి సహకరిస్తాం
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:32 PM
ఆర్యవైశ్యుల అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు.
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, టీజీ వెంకటేశ్
ముఖ్యఅతిథులకు ఘన స్వాగతం
బనగానపల్లె, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఆర్యవైశ్యుల అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. ఆదివారం బనగానపల్లెలోని జీఎస్‌ఎప్ ఫంక్షన్‌హాల్‌లో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు టంగుటూరు శ్రీనయ్య, కార్యదర్శి శ్రీరామ వెంకట సుబ్రమ ణ్యం, ట్రెజరర్‌గా వంకదారివేణుగోపాల్, ఇతర కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారో త్సవానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ముందుగా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, బీసీ ఇందిరమ్మ దంపతులకు, టీజీ వెంకటేశ్ గుప్తాకు టంగుటూరు శ్రీనయ్య ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూ రు లక్ష్మయ్య టంగుటూరు శ్రీనయ్య, ఇతర కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రి బీసీ మా ట్లాడుతూ బనగానపల్లె పట్టణం, గ్రామాల్లోని ఆర్యవైశ్యులు తనను ఆశీర్వ దించారన్నారు. ఆర్యవైశ్యులకు చేయూతనం దించా మన్నారు. టీడీపీలో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలి పారు. టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు బ్యాంకులు లేనప్పుడు పూర్వం బ్యాంకర్లుగా పనిచేసి వేలామందికి ప్రజలకు అప్పులు ఇచ్చి వారి అభివృద్ధికి తోడ్పడినట్లు తెలిపారు. ఆర్యవైశ్యులు తమ ఉనికిని కాపాడుకోవాలన్నారు. సమస్య వచ్చినప్పుడు కలసికట్టుగా ఉండాలన్నారు. 33శాతం మహిళా రిజర్వేషన్లు వస్తే ఆర్యవైశ్యులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి బీసీని కోరారు. సీఎంచంద్రబాబు కూడా ఆర్యవైశ్యులకు అండగా ఉన్నారన్నారు. దివంగత పెండేకంటి వెంకట సుబ్బయ్య అందించిన సేవలను ,ఆయనకుఉన్న లౌక్యాన్ని టీజీ వెంకటేశ్ స్మరించుకున్నారు. టంగుటూరు శ్రీనయ్య మాట్లాడుతూ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, టీజీ వెంకటేశ్ కృషి వల్లనే జిల్లా పదవి వచ్చిందన్నారు. ఈపదవికి న్యాయంచేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు బీసీ ఇందిరమ్మ, జిల్లా కార్యదర్శి శ్రీరామవెం కటసుబ్రమణ్యం, జిల్లా ట్రెజరర్ వంకదారి వేణుగోపాల్, పెండేకంటి కిరణ్‌కుమార్, గుండా సుప్రజ, బండారు లలితతో పాటు పట్టణంలోని ఆర్యవైశ్యులు, జిల్లాలోని నలుమూలలనుంచి ఆర్యవైశ్య సోదరులు పాల్గొన్నారు.