Share News

అన్నదాతకు అండగా ఉంటా

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:28 AM

సీఎం చంద్రబాబు గురువారం పట్టణంలోని ఉన్నత పాఠశాలలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ అన్నదాతకు అండగా ఉంటానని, ఏళ్లుగా పెండింగ్‌ ఉన్న భూముల సమస్యలను పరిష్కరించామన్నారు

 అన్నదాతకు అండగా ఉంటా
బనగానపల్లె రింగ్‌రోడ్డు మ్యాపును పరిశీలిస్తున్న సీఎం

సీఎం చంద్రబాబు నాయుడు

బనగానపల్లెలో పట్టాదార్‌ పాసు పుస్తకాల పంపిణీ, రైతులతో ముఖాముఖి

బనగానపల్లె, జూలై 9 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు గురువారం పట్టణంలోని ఉన్నత పాఠశాలలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ అన్నదాతకు అండగా ఉంటానని, ఏళ్లుగా పెండింగ్‌ ఉన్న భూముల సమస్యలను పరిష్కరించామన్నారు. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈసభకు వేలాదిగా టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. వీరికి మంత్రి బీసీ భోజన సౌకర్యం కల్పించారు. సీఎం హెలిపాడ్‌కు చేరుకున్న అనంతరం నేరుగా సభావేదికకు చేరి 2 గంటలకు పైగా మాట్లాడారు. రైతులకు పట్టాదారు పుస్తకాలు సీఎం పంపిణీ చేశారు. జిల్లా అఽధికారుల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. పనితీరును మెరుగు పరచుకోవాలని వారికి సూచించారు. బాగా పనిచేసిన అధికారులను అభినందించారు. వెనుకబడ్డ వారిని తమ పనితీరును మెరుగు పరచుకోవాలన్నారు. అనంతరం తహసీల్దారు కార్యాలయంలో గూటుపల్లె రైతులతో మంత్రి బీసీ, కలెక్టర్‌ రాజకుమారితో కలసి ముఖాముఖి నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం గూటుపల్లె రైతులకు అన్యాయం చేయగా ఆ భూములను 22ఏ నుంచి తీసివేసి రైతులకు పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. 1500 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించినట్లు ఎస్పీ లిపారు.

పట్టణంలోని హైస్కూల్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన మీభూమి, మీహక్కు సీఎం సభ విజయంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, అధికారులకు మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. క్యాంపు కార్యాలయంల సహకరించిన కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ సునీల్‌షోరెన్‌ ఆర్డీవో నరేంద్రనాథరెడ్డి, రెవెన్యూ సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు పేరు పేరునా ఽధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

డైట్‌ చార్జీల పెంపుపై సీఎంకు కృతజ్ఞతలు

డోన్‌ టౌన్‌: హాస్టల్‌ విద్యార్థుల డైట్‌ చార్జీలు పెంచడం పట్ల సీఎం చంద్రబాబుకు డీసీఎంఎస్‌ చైర్మన్‌, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు యాదవ్‌ కృతజ్ఞతలు తెలిపారు. 26, 27 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించే బీసీల సెమినార్‌ ఆహ్వాన పత్రిక అందజేశారు. మద్దతు తెలిపాలని కోరారు.

సీఎం చంద్రబాబుకు స్వాగతం

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నియోజకవర్గ నాయకులు ఘన స్వాగతం పలికారు. బనగానపల్లె నియోజకవర్గం సీనియర్‌ నాయకులు అంబాల రామకృష్ణారెడ్డి, చల్లా విజయభాస్కర్‌రెడ్డి, పీవీ.కుమార్‌రెడ్డి, మూలే రామేశ్వరరెడ్డి, గువ్వలసుబ్బారెడ్డి, వెంకటరమణ నాయక్‌, కాట్రెడ్డి మల్లిఖార్జునరెడ్డి, వంగల పరమేశ్వర్‌రెడ్డి, అవుకు మండల టీడీపీ అధ్యక్షుడు ఉగ్రసేనారెడ్డి, పొట్టిపాడు సుబ్బారెడ్డి, మోట్ల రామిరెడ్డి, భూషన్న , పలుకూరు గుండం మల్లిఖార్జునరెడ్డి, జిల్లెళ్ల రాజశేఖర్‌రెడ్డి, గూడాల మురళీధర్‌రెడ్డి, గూడాలప్రతా్‌పరెడ్డి, పెండేకంటికిరణ్‌కుమార్‌, బురానుద్దీన్‌, కాశీంబాష, కలాం, సలాం తదితరులు సీఎంకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

హామీలను నెరవేర్చండి

నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీడ్స్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ధర్మవరం సుబ్బారెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. గురువారం బనగానపల్లెలో నిర్వహించిన మీ భూమి- మీ హక్కు కార్యక్రమానికి విచ్చేసిన సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం పలు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. జలదుర్గంను మండల కేంద్రం, గుండాల లిఫ్టు ఇరిగేషన్‌ పూర్తి చేస్తామన్న హామీలను అమలు చేయాలన్నారు. ఇందుకు సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. సీఎంను డోన్‌ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి కలిసి స్వాగతం పలికారు.డోన్‌ నియోజకవర్గ అభివృద్ది, మౌలిక సదుపాయాల విస్తరణ, సంక్షేమ కార్యక్రమాల అమలును చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

Updated Date - Jul 10 , 2026 | 12:28 AM