Share News

రైతులకు అండగా ఉంటాం

ABN , Publish Date - May 12 , 2026 | 12:24 AM

తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత సోమవారం తెలిపారు.

రైతులకు అండగా ఉంటాం
ఆధునిక రైతు బజార్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి టీజీ భరత

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత

కర్నూలు అగ్రికల్చర్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత సోమవారం తెలిపారు. నగరంలోని సీ.క్యాంపు రైతుబజార్‌ విస్తరణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఆధునిక రైతుబజార్‌ ఏర్పాటుకు రూ.6కోట్లను మంజూరు చేశారు. ఈ నిధులతో సోమవారం రైతుబజార్‌ నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో రైతులు, నగర ప్రజలు, పొదుపులక్ష్మి గ్రూపుల మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందించడమే కాకుండా వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన కూరగాయలను అందించే లక్ష్యంతో రైతుబజార్లను ఏర్పాటు చేసిటన్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, మార్కెటింగ్‌ శాఖ ఏడీఎం నారాయణమూర్తి, డీఈ రఘునాథరెడ్డి, కర్నూలు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన గోల్కొండ అజ్మితబీ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల్లో జాప్యం వహించొద్దు

కర్నూలు న్యూసిటి: నగరాభివృద్ధి పనుల్లో జాప్యం వహిస్తే సహించబోమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత గుప్తా అన్నారు. సోమవారం స్థానిక ఎస్‌బీఐ ఎంపాయీస్‌ కాలనీలోని నగర పాలక సమావేశ భవనంలో కమిషనర్‌ చల్లా ఓబు లేష్‌తో కలిసి మున్సిపల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు చేశారా లేదా..? పెండింగ్‌ పనులను వేగవం తం చేయాలని అఽధికారులను ఆదేశించారు. నగరాన్ని స్మార్ట్‌ సిటీగా తీర్చి దిద్దేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని సూచించారు. రహదారులపై ఉన్న గుంతలను గుర్తించి వెంటనే పూడ్చేందుకు ఏఐ సాంకేతికత సాయం తీసుకోవాలన్నారు. సుంకేసుల జలాశయం నుంచి మునగాలపాడు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుకు పైప్‌లైన పనులు వేగవంతం చేయాలన్నారు. తాగునీటి సరఫరా, పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. గార్గేయపురం డంప్‌ యార్డులో బయో మైనింగ్‌ పనులు, ప్లాంట్‌ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. విద్యుత సబ్‌ స్టేషన ఏర్పాటుకు పంప్‌ హౌస్‌, గణేష్‌ నగర్‌ ప్రాంతాల్లో భూమి కేటాయించాలని సూచించారు. ఆస్తి పన్ను మొండి బకాయిదా రులపై కఠినంగా వ్యవ హరించాలన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్‌ సతీష్‌కుమార్‌, ఎస్‌ఈ రమణమూర్తి, ఎంహెచవో ఎం.రఘు, ఆర్వో జునైదు, స్వర్ణలత, వాజిద్‌, ఇనచార్జి సిటీ వైవీ వెంకటరమణ, రఘనందన పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2026 | 12:24 AM