Share News

ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం

ABN , Publish Date - Jan 31 , 2026 | 12:50 AM

ప్రజల సమస్యలను పరి ప్కరిస్తామని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.

ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం
ఎమ్మెల్యే కోట్ల దంపతులను సన్మానిస్తున్న గుడిసె కృష్ణమ్మ

ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి

డోన టౌన, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలను పరి ప్కరిస్తామని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని మల్లెంపల్లె రగ్రామంలో రచ్చబండ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోట్లకు గ్రామ నాయకులు సలీంధ్ర జయన్న యాదవ్‌, సుంకన్నలు ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామం లో నిర్మించిన రూ.15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే కోట్ల, టీడీపీ నాయకులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని శివాలయం వద్ద ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్ర మంలో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వరరెడ్డి, పంచాయతీరాజ్‌ ఏఈ నారాయణ, ఐకేపీ మల్లికా ర్జున, వీఆర్వో రామాంజనేయులు, టీడీపీ నాయకులు వలసల రామ కృష్ణ, లక్కసాగరం లక్ష్మిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటనాయునిపల్లె శ్రీనివాసులు యాదవ్‌, భూమా నాగన్న, కొత్తకోట శ్రీను పాల్గొన్నారు.

‘పది’లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రధానోపాధ్యాయులు, ఉపా ధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్యే కోట్ల సూచించారు. శుక్రవారం పట్టణంలోని పాతపేట జడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం అమలును పరిశీలించారు.

ఎమ్మెల్యే కోట్లను కలిసిన టీడీపీ జిల్లా అధ్యక్షురాలు: టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ శుక్రవారం ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ రెడ్డిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కోట్ల, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ దంప తులను పూలమాలలు వేసి సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు

Updated Date - Jan 31 , 2026 | 12:50 AM