Share News

ఎరువుల ధరలు పెంచితే దుకాణాలను సీజ్‌ చేస్తాం : జేసీ

ABN , Publish Date - May 06 , 2026 | 11:52 PM

రువులను అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాలను సీజ్‌ చేస్తామని ఇన్‌చార్జి కలెక్టర్‌ నూర్‌ఖ్‌మర్‌ హెచ్చరించారు. బుధవారం అకస్మికంగా ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు.

ఎరువుల ధరలు పెంచితే   దుకాణాలను సీజ్‌ చేస్తాం : జేసీ
రికార్డులను పరిశీలిస్తున్న ఇన్‌చార్జి కలెక్టర్‌

సి.బెళగల్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): రువులను అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాలను సీజ్‌ చేస్తామని ఇన్‌చార్జి కలెక్టర్‌ నూర్‌ఖ్‌మర్‌ హెచ్చరించారు. బుధవారం అకస్మికంగా ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎరువుల దుకాణం యజమానులతో మాట్లాడుతూ రైతులకు విక్రయించే ఎరువులు, సీడ్స్‌ పత్తి విత్తనాలను బిల్లులు లేకుండా విక్రయిస్తే దుకాణాలను సీజ్‌ చేయడంతోపాటు యజమానులకు జైలు శిక్ష తప్పదన్నారు. రైతులకు విక్రయించే విత్తనాలకు బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. అలా ఇవ్వని దుకాణం యజమానులపై టోల్‌ఫ్రీ నంబరుకు రైతులు ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. అనంతరం ముడుమాలలో జనగనణ, కొత్తకోటలో రైతులకు పట్టాదారు పాసుబుక్‌లను పంపిణీ చేసి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంట జిల్లా వ్యవసాయశాఖ అధికారులు వరలక్ష్మి, ఏడీఎ సాలురెడ్డి, మండల వ్యవసాయ అధికారి మల్లే్‌షకుమార్‌, పంచాయతీ కార్యదర్శి బేగ్‌, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

Updated Date - May 06 , 2026 | 11:52 PM