Share News

రైతాంగ సమస్యలను పరిష్కరిస్తాం

ABN , Publish Date - Jun 27 , 2026 | 11:12 PM

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని, చుక్కల భూముల సమస్యలు పరిష్కరించి రైతులకు వారి పొలాలను వారికి రికార్డులతో పాటు ఇస్తామని జేసీ నూరుల్‌ ఖమర్‌ అన్నారు.

రైతాంగ సమస్యలను పరిష్కరిస్తాం
దరఖాస్తులను పరిశీలిస్తున్న జేసీ నూరుల్‌ ఖమర్‌

జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌

తుగ్గలి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని, చుక్కల భూముల సమస్యలు పరిష్కరించి రైతులకు వారి పొలాలను వారికి రికార్డులతో పాటు ఇస్తామని జేసీ నూరుల్‌ ఖమర్‌ అన్నారు. శనివారం మండల కేంద్రమైన తుగ్గలిలో 3వ పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ప్రజలు, రైతులు అందించిన అర్జీల వినతులను స్వీకరించి పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా పని చేయాల న్నారు. ఏమైనా సమస్యలు పరిష్కారం కాకపోతే వాటిని వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. శనివారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 48 దరఖాస్తులు వచ్చాయనీ, అన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. రీసర్వేను అవకతవకలుగా చేపడితే భూసమస్యలు తలెత్తుతాయనీ, సక్రమంగా చేస్తే సమస్యలు ఉండవన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి చుక్కల భూముల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతుకలు 22ఏ(1)ను రద్దు చేసి రైతులకు వారి పొలాలకు సంబంధించిన పట్టాలను ప్రజా సమస్యలపరిష్కార వేదికలో అందించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర, ఆర్డీవో ఓబులేసు, తహసీల్దార్‌ రవి, జడ్పీ మాజీ చైర్మన్‌ బత్తిన వెంకట్రాముడు, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు వరలక్ష్మి, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2026 | 11:12 PM