పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తాం
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:33 AM
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు.
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. గురువారం ఎస్‌బీఐ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో విభాగాధిపతులు, అధికారులు, సిబ్బందికి నగరపాలక సంస్థ చేపడుతున్న అభివృద్ధి పనులు, వివిధ కార్యక్రమాలపై పురోగతిపై అవగాహన కల్పించారు. కమిషనర్ మా ట్లాడుతూ ఎనక్యా్‌ప నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నామని, బళ్లారి చౌరస్తా బైపస్ పనులను వేగంగా పూర్తి చేశామన్నారు. పాత కల్లూ రులో వక్కరవాగు సమీపం నుంచి మహవీర్‌కాలనీ వరకు రహదారి అనుసంధానం, కిడ్స్ వరల్డ్ నుంచి కల్లూరు దర్వాజా వరకు రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఆప్కాస్ ఉద్యోగులకు ప్ర మాదాలు సంభవించిన సందర్బంలో వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిం చేందుకు ఉద్యోగుల వేతన ఖాతాలను యాక్సిస్ బ్యాంకు కు మార్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఈ జే.రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు, ఎగ్జామినర్ సుబ్రమణ్యం, ఏఓ రఘునందన పాల్గొన్నారు.