Share News

ప్రతి సమస్యను పరిష్కరిస్తాం

ABN , Publish Date - Jun 12 , 2026 | 11:40 PM

ప్రజా సమస్యల పరిష్కార వే దికలో ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీని పరిష్కరిస్తామని కలెక్టర్‌ ఏ.సిరి, జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ అన్నారు.

ప్రతి సమస్యను పరిష్కరిస్తాం
తుగ్గలిలో అర్జీలను స్వీకరిస్తూ పరిశీలిస్తున్నకలెక్టర్‌ ఏ. సిరి

కలెక్టర్‌ ఏ. సిరి

పీజీఆర్‌ఎస్‌కు 140 దరఖాస్తులు

తుగ్గలి, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వే దికలో ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీని పరిష్కరిస్తామని కలెక్టర్‌ ఏ.సిరి, జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ అన్నారు. శుక్రవారం తుగ్గలి సాధన పాఠశాలలో ‘ఒక నెల - ఒక వారం, ఒక నియోజకవర్గం నాలుగు పర్యట నలు’లో భాగంగా ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు పీజీఆ ర్‌ఎస్‌ కార్యక్రమం నిర్వహించి నియోజకవర్గంలోని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించగా.. మిగిలిన వాటిని సంబంధిత శాఖ అధికారులకు అందించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 140 దరఖాస్తులు వచ్చాయి. ఆసమస్యలన్నిటినీ పరిష్క రిస్తామని, సమస్యల పరిష్కారం ఎక్కడి దాకా వచ్చిందీ అర్జీదారులకు తెలిసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి, ఆర్డీవో ఓబులేసు, తహసీల్దార్‌ రవి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2026 | 11:41 PM