బీవీ మోహన్‌రెడ్డి కల సాకారం చేస్తాం
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:29 AM
ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు 24 గంటలు తాగునీరు అందించాలన్న తన తండ్రి దివంగత నేత బీవీ మోహన్‌రెడ్డి కల సాకారం చేస్తామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని శ్రీనివాస సర్కిల్‌లో ఎమ్మిగనూరు సమగ్ర తాగునీటి మెరుగుదల పథకం (యుఐడీఎఫ్ ట్రాంచ్ -11) కింద ఎన్‌హెచ్‌బీ రుణ సాయం రూ.157.3 కోట్లతో ఏర్పాటు చేయనున్న పథకానికి భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు
ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి
రూ.157.3 కోట్ల తాగునీటి పథకానికి భూమిపూజ
ఎమ్మిగనూరు, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు 24 గంటలు తాగునీరు అందించాలన్న తన తండ్రి దివంగత నేత బీవీ మోహన్‌రెడ్డి కల సాకారం చేస్తామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని శ్రీనివాస సర్కిల్‌లో ఎమ్మిగనూరు సమగ్ర తాగునీటి మెరుగుదల పథకం (యుఐడీఎఫ్ ట్రాంచ్ -11) కింద ఎన్‌హెచ్‌బీ రుణ సాయం రూ.157.3 కోట్లతో ఏర్పాటు చేయనున్న పథకానికి భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మైనార్టీ కాలనీలో పైప్‌లైన్ పనులు ప్రా రంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరిగిన జనాభకు అనుగుణంగా ఎల్లెల్సీ కాలువకు పక్క రాష్ట్రం నుంచి నీరు రావాల్సి ఉన్నా అరకొరగా వస్తున్నాయన్నాయన్నారు. నియోజ కవర్గంలోనే నీటిని నిల్వ చేసుకునేందుకు ముఖ్యమంత్రిని ఒప్పించామన్నారు. ఇందులో భాగంగా 0.25 టీఎంసీ నీటిని శ్రీశైలం నుంచి హంద్రీనీవా కాలువ ద్వారా గాజులదిన్నె ప్రాజెక్టుకు తరలించనున్నట్లు తెలిపారు. అక్కడ నుంచి మనకు అవసరం ఉన్నప్పుడంతా నీటిని 19 కి.మీ పైప్‌లైన్ ద్వారా పట్టణానికి తరలించి 24 గంటలు పట్టణవాసులకు సరఫరా చేస్తామన్నారు. ఇందుకు పట్టణంలో 92 కి,మీ మేర కొత్తగా పైప్‌లైన్ వేస్తున్నా మన్నారు. ఈపథకం పూర్తయితే పట్టణానికి దాదాపు 30 నుంచి 40ఏళ్ల వరకు తాగునీటి సమస్య ఉండదన్నారు. గతంలో యూజీడీ పేరుతో పట్టణంలోని రోడ్లను తవ్వి తగలేశారని, అలాకాకుండా పనులు పూర్తయిన వెంటనే 20 రోజుల్లో రోడ్లు బాగుచేయాలన్నారు. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఈఈ గుర్రప్పయాదవ్, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, డీ ఈఈ వెంకటేశ్వర్లు, కుర్ణి కార్పొరేషన్ చైర్మన్ మిన్నప్ప, ఏఎంసీ చైర్మన్ మల్లయ్య, టీడీపీ జిల్లా ఉపాధఽ్యక్షుడు భాస్కర్ల చంద్రశేఖర్, ఏఈలు నాగశేఖర్ రావు, విరుపాక్షి, మహేష్, వినోద్, ఎన్‌సీసీ ప్రతినిధి రమే్‌షకుమార్, టీడీపీ నాయకులు ఎంబీ మహేష్, కేఎండీ ఫారుక్, ముల్లా కలీముల్లా, మహేంద్రబాబు, మిఠాయి నరసింహులు, మల్లెల ఆల్‌ఫ్రెడ్ రాజు, మచాని శివకుమర్, రామకృష్ణ నాయుడు, సరోజమ్మ, దేవమ్మ, అన్నపూర్ణమ్మ, పార్వతి, బడేబీ, విజలక్ష్మి పాల్గొన్నారు.