బాధితులకు సత్వర న్యాయం చేస్తాం
ABN , Publish Date - Apr 27 , 2026 | 11:28 PM
బాధితుల సమస్యల పరిష్కారానికి సత్వరమే విచారణ చేపట్టాలని ఎస్సీ సునీల్ షెరాణ్ పేర్కొన్నారు.
ఎస్పీ సునీల్ షెరాణ్
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 80 ఫిర్యాదులు
నంద్యాల క్రైం, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): బాధితుల సమస్యల పరిష్కారానికి సత్వరమే విచారణ చేపట్టాలని ఎస్సీ సునీల్ షెరాణ్ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో దాదాపు 80 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులతో ఎస్పీ బాధితులతో మాట్లాడి, వారికి సత్వరమే న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి పునరావృతం కాకుండా చూడాలని అధికారులను సూచించారు.