Share News

ప్రతి ఎకరాకు హంద్రీనీవా నీటిని ఇస్తాం

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:14 PM

కూటమి ప్రభుత్వ హయాంలో అన్ని చెరువులను హంద్రీనీవా నీటితో నింపి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.

ప్రతి ఎకరాకు హంద్రీనీవా నీటిని ఇస్తాం
చెరువును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు

పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు

తుగ్గలి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ హయాంలో అన్ని చెరువులను హంద్రీనీవా నీటితో నింపి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. మంగళవారం తుగ్గలి మండలంలోని రాతన చెరువును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నీటి ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు రూ.వేలకోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. పత్తికొండ నియోజకవర్గంలోని అన్ని చెరువులను నీటితో నింపడంతో పాటు ఆయకట్టు భూములను అభివృద్ధి చేసి కోనసీమ ప్రాంతంలో మాదిరి మన ప్రాంతలో కూడా మూడు పంటలకు నీరు అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు గుండాలుగా మారి అలజడులు సృష్టిస్తున్నారన్నారు. వారు నోరు జాగ్రత్తగా పెట్టుకోకపోతే ప్రజలే బుద్ది చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర, టీడీపీ నాయకులు మనోహర్‌ చౌదరి, ఈరన్న స్వామి, కృష్ణమూర్తి చౌదరి, ఈరమ్మ, మైరాముడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 11:14 PM