Share News

కార్మికులకు మెరుగైన సేవలు అందిస్తాం

ABN , Publish Date - Jun 10 , 2026 | 11:17 PM

కార్మిక రాజ్య బీమా పథకం ద్వారా బీమా పొందిన కార్యికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన సేవలు అందిస్తామని కార్మిక రాజ్య బీమాసంస్థ ఉప ప్రాంతీ య (తిరుపతి) జాయింట్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణ పేర్కొన్నారు.

కార్మికులకు మెరుగైన సేవలు అందిస్తాం

నంద్యాల రూరల్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి) : కార్మిక రాజ్య బీమా పథకం ద్వారా బీమా పొందిన కార్యికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన సేవలు అందిస్తామని కార్మిక రాజ్య బీమాసంస్థ ఉప ప్రాంతీ య (తిరుపతి) జాయింట్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని బొమ్మలసత్రంలో కార్మిక రాజ్య బీమాసంస్థ ( ఈఎస్‌ఐసీ) నూతన శాఖను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈఎస్‌ఐసీ ద్వారా అందిస్తున్న వివిధ సామాజిక భద్రతా ప్రయోజనా లను వివరించారు. అనంతరం అర్హులైన వారికి డిపెండెంట్‌ బెనిపిట్‌ సర్టిపికెట్లను అందజేశారు. డిపెండెంట్‌ బీమా పొందిన వారి పిల్లలకు ఈఎస్‌ఐద్వారా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో నామమాత్రం పీజుతో ప్రవేశం పొందవచ్చునని తెలిపారు. నంద్యాల శాఖ ద్వారా జిల్లాలో 1035 మంది యజమానులు, 17,958 మంది బీమా పొందారని వారికి ప్రయోజ నాలు మరింత సమర్ధవంతంగా అందిస్తామన్నారు, ఈ కార్యక్రమంలో ఈఎస్‌ఐసీ ఉప ప్రాంతీయ అసిస్టెంట్‌ డైరెక్టర్టు మధుసూదన్‌, శ్రీరామకృష్ణ, జేడీఐఎంఎస్‌ కడప జాయింట్‌ డైరెక్టర్‌ అబ్దుల్‌కరీం, కర్నూలు బ్రాంచ్‌ మేనేజర్‌ దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 11:17 PM