Share News

సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:54 AM

అంగన వాడీ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తా మని సీఐటీయూ శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ పి.నిర్మల హెచ్చరిం చారు.

సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం
మాట్లాడుతున్న నిర్మల

కర్నూలు రాజ్‌విహార్‌ సర్కిల్‌, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): అంగన వాడీ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తా మని సీఐటీయూ శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ పి.నిర్మల హెచ్చరిం చారు. మంగళవారం స్థానిక ధర్నాచౌక్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌ వాడీల నిరసన చేపట్టారు. నిర్మల మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో అంగనవాడీల డిమాండ్లకు మద్దతు ఇచ్చిన కూటమి నాయకులు అధికా రంలోకి రాగానే హామీలు అటకెక్కించారని ఎద్దేవా చేశారు. అంగనవా డీలకు కనీస వేతనం రూ20 వేలు చెల్లించాలని, 164 సూపర్‌వైజర్ల స్థానాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. మే నెల మొత్తాన్ని వేసవి సెలవులుగా పరిగణించాలని, యాప్‌ల పేరుతో పనిభారం మోపడం తగదన్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ, హెల్త్‌కార్డు సౌకర్యాలు కల్పించాలని కోరా రు. ఈ నెల 27లోపు తమ డిమాండ్లపై స్పందించాలని లేనిపక్షంలో మార్చి 2న చలో విజయవాడ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీ యూ నాయకులు బాలదర్గమ్మ, మహ్మద్‌ రఫీ, అంగనవాడీ ప్రతినిధులు కృష్ణవేణి, విజయ, పద్మజ, మల్లేశ్వరి పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 12:54 AM