రైతుల భూ హక్కులను కాపాడుతాం
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:51 AM
రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూమి హక్కులను కాపాడడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని డోన ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ రెడ్డి పేర్కొన్నారు.
డోన ఎమ్మెల్యే సూర్యప్రకాశ రెడ్డి
పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
బేతంచెర్ల, జనవరి 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూమి హక్కులను కాపాడడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని డోన ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గోర్లగుట్ట, అంబాపురం గ్రామాల్లో తహశీల్దార్ నాగమని అధ్యక్షతన గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన డోన ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నూతన పట్టాదారు పాస్ పుస్తకాలపై కేవలం ప్రభుత్వ రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంచడం ద్వారా ఎలాంటి రాజకీయ చిహ్నాలు లేకుండా రూపొందించామన్నారు. డోన ఆర్డీవో నరసింహులు. ఎంపీడీవో ఫజల్ రహమాన, బేతంచెర్ల నగర పంచాయతీ కమిషనర్ హరిప్రసాద్, ఎస్‌ఐ రమేష్‌బాబు పాల్గొన్నారు.
ప్రజాధనం వృథా: ఎమ్మెల్యే అఖిలప్రియ
ఆళ్లగడ్డ: వైపీ హయంలో జగనమోహనరెడ్డి పబ్లిసిటీ కోసం పాసుపుస్తాకాలు సర్వే రాళ్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్రజాధనాన్ని వృథాచేశారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విమర్శించారు. మండలంలోని అహోబిలంలో తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి ఆధ్వర్యంలో ఆంద్రప్రదేశ ప్రభుత్వం ఏపి రీ సర్వే ప్రాజెక్టు కింద రైతులకు రాజముద్రతో మంజూరు చేసిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నిర్వహించారు. టీడీపీ మండల కన్వినర్ శీలం హరికుమార్‌రెడ్డి, సంజీవరాయుడు, డీటీ నర్సిరెడ్డి. ఆర్‌ఐ చంద్రనాయక్ పాల్గొన్నారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
చాగలమర్రి: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ రాష్ట్ర మైనార్టీసెల్ ఉపాధ్యక్షుడు అన్సర్‌బాషా తెలిపారు. చాగలమర్రి సంత మార్కెట్‌లోని సచివాలయం వద్ద తహసీల్దార్ విజయ్‌కుమార్ ఆధ్వర్యం లో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ గ్రామసభ నిర్వహించారు.
రైతుల అభ్యున్నతే..
శిరివెళ్ల: రాష్ట్రంలోని రైతుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ కాటంరెడ్డి శ్రీకాంతరెడ్డి అన్నారు. మండలంలోని కోటపాడులో రైతులకు పట్టాదారు పాసుపుస్తకా లు అందజేశారు.