Share News

అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోం

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:07 AM

అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోబోమని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌ రెడ్డి అన్నారు.

 అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోం
రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న నాయకులు

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌ రెడ్డి

కాంగ్రెస్‌ కార్యాలయంపై గుడ్లు, టమోటాలు విసిరిన నాయకులు

కర్నూలు అర్బన్‌, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోబోమని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌ రెడ్డి అన్నారు. కర్నూలు నగరంలోని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట బీజేవైఎం, వీహెచ్‌పీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. కార్యాలయంపై కోడిగుడ్లు, టమోటాలు విసిరారు. కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చింపివేశారు. రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సునీల్‌రెడ్డి మాట్లాడుతూ.. పెట్టుబడుల కోసం ప్రధాని మోదీ ఢిల్లీలో సమ్మిట్‌ ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్‌ శ్రేణులు అరాచకం సృష్టించారని మండిపడ్డారు. 16 మందిలో నలుగురిని మాత్రమే అరెస్టు చేశారని, మిగతా వారిని కూడా అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. దేశాభివృద్ధిని అడ్డుకుంటే కాంగ్రెస్‌ కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఇళ్లపై దాడులకు వెనుకాడబోమని హెచ్చరించారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అడుగడుగునా అభివృద్ది, సంక్షేమాన్ని అడ్డుకునే కుట్రలకు పాల్పడితే భారతీయ జనతా యువ మోర్చా చూస్తే ఊరుకోదని హెచ్చరించారు. దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టుబడులు తీసుకువచ్చి అభివృద్ది దిశగా అడుగులు వేస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల ఇలా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిం చారు. కార్యక్రమంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు వెంకట సుజాత, జిల్లా అధ్యక్షుడు కేవరామ్‌ చౌదరి, మాలతి, గీతామాధురి, భరత్‌, ప్రశాంత్‌ , ప్రసాద్‌, అఖిల్‌, పార్టీ కాశీవిశ్వనాథ్‌ మద్దిలేటి పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 12:07 AM