Share News

అన్న క్యాంటీన్‌పై దుష్ప్రచారం సహించం

ABN , Publish Date - Oct 09 , 2026 | 11:04 PM

ఆళ్లగడ్డలోని అన్న క్యాంటీన్‌పై దుష్ప్రచారాన్ని సహించబోమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరించారు.

అన్న క్యాంటీన్‌పై దుష్ప్రచారం సహించం
భోజనాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ఆళ్లగడ్డ, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డలోని అన్న క్యాంటీన్‌పై దుష్ప్రచారాన్ని సహించబోమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరించారు. పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే, అన్న క్యాంటీన్‌ ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌, సీఐ బి.రాము, మున్సిపల్‌ కమిషనర్‌ కిషోర్‌బాబు ఆకస్మికంగా తనిఖీ చేసి భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు రూ.5కే కడుపునిండా అన్నం పెట్టాలన్న సదుద్దేశంతో అన్న క్యాంటీలను నిర్వహిస్తోందన్నారు. అయితే అ న్న క్యాంటీన్‌లో ఆహారం సరిగ్గా లేదంటూ వైసీపీ సోషల్‌ అకౌంట్లలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కడప జిల్లా కేం ద్రం నుంచి అన్ని అన్న క్యాంటీన్లకు భోజనం వస్తోందని, నాణ్యమైన భోజనం అందుతున్నప్పటికీ ఆళ్లగడ్డలో మాత్రమే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజన నాణ్యత, సదుపాయాలను పరిశీలించడంతో పాటు ప్రజలను కూడా అడిగి వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నామని చెప్పారు. అన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యతపై ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చిన సోస్టులపై విచారించి చర్యలు తీసుకోవాలని సీఐ రామును కోరారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ బాలస్వామి, మాజీ కౌన్సిలర్‌ హుస్సేన్‌ బాషా, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2026 | 11:05 PM