Share News

ప్రజా సమస్యలపై నిర్లక్ష్యాన్ని సహించం : మంత్రి బీసీ

ABN , Publish Date - Feb 01 , 2026 | 11:58 PM

ప్రజా సమస్యలపై అఽధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించమని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

ప్రజా సమస్యలపై నిర్లక్ష్యాన్ని సహించం : మంత్రి బీసీ
వినతులు స్వీకరిస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలపై అఽధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించమని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వచ్చిన వినతిపత్రాలను స్వయంగా మంత్రి స్వీకరించారు. వివిధ గ్రామాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు, బాధితులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అఽధికారులు మంత్రి క్యాంపు కార్యాలయానికి తరలివచ్చి సమస్యలను మంత్రికి విన్నవించారు. కొన్ని సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కరించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పొలం వివాదాలు, వ్యక్తిగత సమస్యలు మంత్రి దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు. మంత్రి బీసీ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధితో కూడిన సుపరిపాలనను అఽధికారులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ప్రజాసమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు.

Updated Date - Feb 01 , 2026 | 11:58 PM