Share News

రైతులకు నష్టం చేస్తే సహించం

ABN , Publish Date - Jan 07 , 2026 | 12:17 AM

కర్నూలు మార్కెట్‌ యార్డులో రైతులు పంట ఉత్పత్తులను ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా పంట ఉత్పత్తులను అమ్మకానికి తెస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కమిషన్‌ ఏజెంట్లు, వ్యాపారులు రైతులకు గిట్టుబాటు ధర అందించాలని కర్నూలు మార్కెట్‌ కమిటీ సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మి సోమవారం స్పష్టం చేశారు.

రైతులకు నష్టం చేస్తే సహించం
మార్కెట్‌ కమిటీలో ఏర్పాటు చేసిన చార్జీల వివరాల బోర్డు

కమీషన్‌ ఏజెంట్లకు కార్యదర్శి హెచ్చరిక

హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

కర్నూలు అగ్రికల్చర్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మార్కెట్‌ యార్డులో రైతులు పంట ఉత్పత్తులను ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా పంట ఉత్పత్తులను అమ్మకానికి తెస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కమిషన్‌ ఏజెంట్లు, వ్యాపారులు రైతులకు గిట్టుబాటు ధర అందించాలని కర్నూలు మార్కెట్‌ కమిటీ సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మి స్పష్టం చేశారు. రైతులు తెస్తున్న పంట ఉత్పత్తులను వాహనాల నుంచి దించే సమయంలో అదే విధంగా సంచులను కోసి పంట ఉత్పత్తులను కుప్ప పోసేందుకు, నింపేందుకు రైతుల నుంచి 2 శాతం కమిషన్‌ మాత్రమే వసూలు చేయాల్సి ఉందని అన్నారు. ఉల్లిపాయలపై నాలుగు శాతం కమిషన్‌ వసూలు చేయాల్సి ఉందని కమిషన్‌ ఏజెంట్లకు సెక్రటరీ జయలక్ష్మి స్పష్టం చేశారు. వేరుశనగ కాయలు, పూల విత్తనాలు, ఆముదాలు, మొక్కజొన్నలు, వాము, కందులు, శనగలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు ఒక బస్తాపై అన్నీ చార్జీలు కలిపి రూ.15.12 మాత్రమే వసూలు చేయాలని, ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనం నుంచి బస్తాను దించేందుకు రూ.5.04, కోసి కుప్ప పోసేందుకు రూ.5.04, చాట నింపేందుకు రూ.5.04 మొత్తం రూ.15.12 మాత్రమే రైతుల నుంచి వసూలు చేయాలని అదేశించారు. =

Updated Date - Jan 07 , 2026 | 12:17 AM