ఆస్తులను కాజేయాలని చూస్తే ఊరుకోం
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:12 AM
ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ప్రార్థనల పేరుతో క్రైస్తవ విద్యాసంస్థల ఆస్తులను కబ్జా చేయాలని చూస్తే ఊరుకోమని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌ్‌సదేశాయ్ హెచ్చరించారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి గౌ్‌సదేశాయ్
కర్నూలు న్యూసిటీ, జూలై 14(ఆంధ్రజ్యోతి): ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ప్రార్థనల పేరుతో క్రైస్తవ విద్యాసంస్థల ఆస్తులను కబ్జా చేయాలని చూస్తే ఊరుకోమని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌ్‌సదేశాయ్ హెచ్చరించారు. నగరంలోని ఎస్టీబీసీ కళావాల మైదానంలో స్టేజీ వెనుక ఉన్న స్థలాన్ని కల్వరి మిషనర్ నెల రోజుల ప్రార్థన పేరుతో కబ్జా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి క్రైస్తవ సంస్థలు, దళిత సంఘాలు చేస్తున్న ఆందోళనకు సీపీఎం నాయకులు సంఘీభావం తెలిపారు. గౌస్‌దేశాయ్ మాట్లాడుతూ నగరంలో అనేక చోట్ల క్రైస్తవ విద్యాసంస్థల ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయన్నారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి ఆస్తికి రక్షణ కల్పించాలని లేనపక్షంలో క్రైస్తవ సామాజిక సమూహలు చేసే ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలుపుతామన్నారు. కాంగ్రెస్ నాయకులు అనంతరత్నం, బీఎస్పీ నాయకులు క్రైస్తవ మత పెద్దలు జయకాంత క్రిస్టియన, ఏస న్న, ప్రభుదాసు, సీపీఎం నాయకులు రాధాకృష్ణ, ఎండీ ఆనంద్‌బాబు, టి.రాముడు, సి.గురుశేఖర్, రాజశేఖర్ పాల్గొన్నారు.