Share News

మహిళలను వేధిస్తే ఉపేక్షించం

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:15 AM

మహిళలపై వేధింపులు దాడులు చేసే వారు ఏ పార్టీ వారైనా సరే ఉపేక్షించబోమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు హెచ్చరించారు.

మహిళలను వేధిస్తే ఉపేక్షించం
చికిత్స పొందుతున్న లేపాక్షిని పరామర్శిస్తున్న ఎంపీ బస్తిపాటి నాగరాజు

కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు

ఆలూరు, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): మహిళలపై వేధింపులు దాడులు చేసే వారు ఏ పార్టీ వారైనా సరే ఉపేక్షించబోమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు హెచ్చరించారు. వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంగన్‌వాడీ టీచర్‌ కురువ లేపాక్షిని మంగళవారం ఎంపీ పరామర్శించారు. జరిగిన సంఘటనపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని స్థానిక వైద్యులకు సూచించారు. అనంతరం ఎంపీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆలూరు ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు. ఎవరో రెచ్చగొడితే ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు గొడవలు పెట్టుని కేసులో ఇరుక్కోవద్దని సూచించారు. పెద్దహోతూరు గ్రామానికి చెందిన వీరేష్‌ అనే వ్యక్తి గ్రామంలో అరాచకాలు చేస్తూ మూడు నెలలుగా అంగన్‌వాడీ కార్యకర్త లేపాక్షిని సఅభ్య పదజాలంతో దూషిస్తూ మానసికంగా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకునేవరకు వెళ్లిదంటే వేధింపులు ఏ స్థాయిలో చేశాడో తెలుస్తుందన్నారు. ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించలని జిల్లా ఎస్పీ, డీఎస్పీ, సీఐలను ఎఫ్‌ఐఆర్‌ చేయాలని సూచించామన్నారు. కురువ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవేంద్రప్ప, డైరెక్టర్‌ రామకృష్ణ, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్‌ కురువ జయరాం, రఘుబాబు, లక్ష్మన్న పాల్గొన్నారు.

Updated Date - Jul 01 , 2026 | 12:15 AM