Share News

నమ్మకాన్ని వమ్ముచేయం

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:36 AM

టీడీపీలోకి వచ్చిన వారి నమ్మకాన్ని వమ్ముచేయమని డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకా్‌షరెడ్డి అన్నారు

నమ్మకాన్ని వమ్ముచేయం
టీడీపీలో చేరిన వారితో ఎమ్మెల్యే కోట్ల

ప్యాపిలి, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): టీడీపీలోకి వచ్చిన వారి నమ్మకాన్ని వమ్ముచేయమని డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకా్‌షరెడ్డి అన్నారు. గురువారం పెద్దపూదిళ్ల గ్రామంలో వైసీపీకి చెందిన దాదాపు వంద కుటుంబాలు కోట్ల సమక్షంలో టీడీపీలో చేరారు. కమతం భాస్కరెడ్డి, చంద్రపల్లికి చెందిన మహే్‌షరెడ్డి, నక్కలవాగుపల్లి చెందిన వైసీపీ నాయకులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వారందరికి కోట్ల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోట్ల రాఘవేంద్రరెడ్డి, లక్ష్మినారాయణయాదవ్‌, ప్రభాకర్‌రెడ్డి, అలేబాదు పరమేష్‌, రాజా నారాయణమూర్తి, సుదర్శన్‌, ఆర్‌ఈ నాగరాజు. ఖాజాపీర్‌; కుమ్మరి సుధాకర్‌, రామ్మోహన్‌యాదవ్‌, కాంతారెడ్డి, ఓబులేసు, మహేష్‌, చంద్రబోస్‌ పాల్గొన్నారు.

రైతుకు సేవలందించడమే లక్ష్యం

డోన్‌ టౌన్‌: రైతులుర ఆర్థికాభివృద్ది సాధించేలా మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోట్ల అన్నారు. గురువారం పశుసంవర్దక శాఖ ఆధ్వర్యంలో విలేజ్‌ హెర్డ్‌ ఫర్టిలిటీ రిజిస్టర్‌ను ఆవిష్కరిచారు.

Updated Date - Jun 12 , 2026 | 12:36 AM