రత్నాల ‘సీమ’గా మారుస్తున్న కూటమి ప్రభుత్వం
ABN , Publish Date - Jul 04 , 2026 | 11:37 PM
గొడ్డలి పార్టీ రాయలసీమకు అన్యాయం చేస్తే సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాయలసీమను రత్నాల సీమగా మారుస్తోందని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్
బనగానపల్లె జూలై 4 (ఆంధ్రజ్యోతి): గొడ్డలి పార్టీ రాయలసీమకు అన్యాయం చేస్తే సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాయలసీమను రత్నాల సీమగా మారుస్తోందని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం బనగా నపల్లె మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గొడ్డలి పార్టీ విధ్వంస పాలన సాగించగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నేతృత్వంలో ప్రజాస్వామ్య పాలన సాగిస్తోందన్నారు. కడప ఎంపీ అవినా్‌షరెడ్డి కూటమి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాయలసీమ అభివృద్ధిపై చర్చకు రావాలని మంత్రి బీసీ సవాల్ విసిరారు. కేవలం రాజకీయ ఉనికికోసం అవినాశ్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వేలాది పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు. వైసీపీ నాయకులు కేవలం శంకుస్థాపనలకే పరిమితమన్నారు.